క్రీడాభూమి

రైతు సంక్షేమాన్ని విస్మరించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 8: తీవ్రమైన వర్షాభావంతో అల్లాడుతున్న మహారాష్టల్రో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన ఐపిఎల్ మ్యాచ్‌లను మరో చోటికి మార్చాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిఐఎల్) దాఖలవడమే ఇందుకు కారణం. అయితే ఈ పిటిషన్‌పై బాంబే స్పందిస్తూ, శనివారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌ను నిర్వహించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే క్షామంతో అల్లాడుతున్న రాష్ట్రంలోని రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమకు ఎటువంటి సూచనలు వస్తే వాటికి అనుగుణంగానే నడుచుకుంటామని ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు. శుక్రవారం ఇక్కడ ఐపిఎల్-9 ఆరంభ వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ‘రైతుల సంక్షేమానికి ఐపిఎల్‌తో పాటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కట్టుబడి ఉన్నాయి. ఈ విషయంలో మాకు ఎటువంటి సూచనలు వచ్చినా వాటికి అనుగుణంగానే నడుచుకుంటాం’ అని ఆయన తెలిపాడు. ఈ ఏడాది ఐపిఎల్‌లో భాగంగా మహారాష్టల్రోని ముంబయి, పుణె, నాగ్‌పూర్‌లలో మొత్తం 19 మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది. అయితే ఐపిఎల్‌ను వినోదం కోసమే నిర్వహిస్తున్నామన్న భావన సరైంది కాదని శుక్లా పేర్కొన్నాడు. ‘ఇది కేవలం వినోదం కోసం నిర్వహిస్తున్నది కాదు. ఈ టోర్నీలో ఎన్నో మ్యాచ్‌లు చిట్ట చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగుంతుంటాయి. ఎంతో మంది వర్థమాన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తున్న ఐపిఎల్‌కు ఏటేటా ప్రజాదరణ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గత ఎడిషన్ల కంటే ఈసారి ఈ టోర్నీని మరింత వైభవంగా నిర్వహించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం’ అని ఆయన చెప్పాడు.