అమృత వర్షిణి

మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ప్రతిభావంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా మిమ్మల్ని ఫలానా సబ్జెక్టులో పనికిరాని వాడివని అంటే మీరు ఘనత చెందిన మేధావుల జాబితాలో ఉన్నట్లే. ఐన్‌స్టీన్ బాల్యస్థితిలో మాట్లాడటం, ఆలస్యంగా వచ్చింది. చదువులో చురుగ్గా ఉండేవాడు కాదు. తెలివితక్కువవాడని తండ్రి భయపడుతూ ఉండేవాడు.
థామస్ ఆల్వా ఎడిసన్‌ది ‘మట్టిబుర్ర’ అని సహ విద్యార్థులతో సరిపడే స్థాయిలో లేడని ‘తికమక’ పడుతూ ఉంటాడని ఉపాధ్యాయుడు అతనిని తక్కువగా చూసేవాడు. చరిత్రలో అంతటి మేధావి లేడని ఆ తరువాత ఎడిసన్ ముద్ర వేసుకున్నాడు. మీ విషయంలోనూ ఇది నిజమని మరువకూడదు.
మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తరచూ పొరబడుతూ ఉంటారు. అంతేకాదు ఎందరో అపర మేధావులు తమ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. దీనికి కారణాలు ఉన్నాయి.
మీ మెదడుకు నలభై పరిమాణాలున్నాయి. వీటిలో కొన్ని నవీన కల్పనాశక్తి, న్యాయ నిర్ణయ శక్తి, ముందు చూపు, రాబోయే పరిణామాలను ముందుగా గ్రహించే సామర్థ్యం, ఆలోచనలను మాటల రూపంలో చక్కగా వ్యక్తపరచగల నైప్యుం, ఎదుటివారు చెప్పిన విషయాలను సంక్షిప్తం చేసి అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పగల్గడం మొదలయినవి.
రాబోయే రోజుల్లో మరికొన్ని మెదడు పరిమాణాలు కనుగొనవచ్చు. తెలివైన వారు తరచూ తామంత ప్రతిభావంతులు కాదని ఎందుకు అనుకుంటారు? అనేది మనముందున్న ప్రశ్న.
కారణాలు
ఏ ఒక్కరూ పైన తెలియజేసిన నలభై పరిమాణాలలో ప్రతిభావంతంగా ఉండరు. కొన్ని మేథోపరమైన సమస్యల విషయంలో వారు వెనుకంజలో ఉంటారు.
ఉదాహరణకు ఒక వ్యక్తి గణితంలో అత్యంత ప్రతిభావంతంగా ఉంటాడు. కాని ఇతర సబ్జెక్టుల గురించి ప్రశ్నిస్తే తెల్లమొహం వేస్తాడు. మరొక వ్యక్తి వస్తువులు అమ్మకాలు భేషుగ్గా ఎలా చేయవచ్చునో అద్భుతంగా రూపకల్పన చేస్తాడు. ఎంత కమీషన్ వస్తుందో చెప్పలేకపోతాడు.
ఒకామె గదిలో సోఫా ఎక్కడ పెడితే బాగుంటుందో ఊహించలేదు. ఎవరైనా సూచిస్తే పెట్టి ఎంతో బాగుందని సంతోషిస్తుంది. అంటే ఆమెకు ముందు చూపు తగినంత లేకపోవచ్చు. ఇతరత్రా చాలా ప్రతిభావంతంగా ఉంటుంది.
తెలివైన ప్రతిభావంతునికి తన హద్దులు తెలుసు. కొన్ని అంశాల్లో తాను వెనుకపడిన విషయం తెలిసిన ఆ వ్యక్తి తన గురించి తాను తక్కువగా అంచనా వేసుకుంటాడు. మిగిలిన ముప్పై ఏడు అంశాల్లో అతడు ప్రతిభావంతుడనే విషయాన్ని అతను పరిగణనలోకి తీసుకోడు.
సాధారణ తెలివిగల వారు కూడా తాము అనుకున్న దానికన్నా ప్రతిభావంతంగా ఉంటారు. తెలివి అనేది ఆలోచించగల సామర్థ్యం. కాని తెలివికి పెట్టే పరీక్షల్లో ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షించే శైలి తగినంతగా ఉండదు.
మేధావిగా వర్గీకరించడం ఎలా?
సాధారణ ప్రతిభ గలవారు తమ సామర్థ్యం మేర వారి తెలివిని ఉపయోగించగల్గితే వారిని మానసిక శాస్తవ్రేత్తలు మేధావులుగా వర్గీకరించవచ్చునంటున్నారు.
ఒక పారిశ్రామికవేత్త దగ్గరకు ఒక వ్యక్తి వెళ్లి ‘నేను మీ ఉద్యోగుల చేత మరింత ప్రతిభావంతంగా పని చేయించగలను’ అన్నాడు. ఆ పారిశ్రామికవేత్త ఆశ్చర్యపోతూ ‘వాళ్లకు పని చెయ్యడం ఎలాగో తెలుసు. నువ్వు ఏం చేయగలవు?’ అని అడిగాడు.
ఆ పారిశ్రామికవేత్తకు ఒక విషయం తెలియదు. చాలామందికి కూడా ఈ విషయం తెలియదు. ‘పని బాగా చేస్తున్నారనుకునే వారంతా తమ మెదడు సామర్థ్యంలో పదోవంతు మాత్రమే వినియోగిస్తున్నారు.’
విలియమ్స్‌ను తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చి చదువు నేర్పారు తల్లి డాక్టర్ సారాసిద్దిస్ దృష్టిలో తన కొడుకు సామాన్య తెలివితేటలు గలవాడు. కాని ఏడాది వయసులో విలియమ్స్ చిన్నచిన్న మాటలు మాట్లాడేవాడు. రెండేళ్ల వయసుకే బాగా చదివేవాడు. అయిదేళ్ల వయసుకు తను అనుకున్నది టైపు చేయగల్గడమే గాక నాల్గు భాషలు మాట్లాడేవాడు. ఎనిమిదేళ్లకు హైస్కూలులో చేరి పదకొండు సంవత్సరాల వయసుకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధకులకు ‘నాల్గవ కొలత’పై ఉపన్యాసం ఇచ్చాడు.
తల్లి బోధన విలియమ్స్ మత్తుగా వున్నప్పుడు, నిద్రలోకి జారుకుంటున్నప్పుడు కూడా చేసేది. చాలామంది మానసిక శాస్తవ్రేత్తలు ‘మనిషి నిద్రలో కూడా నేర్చుకోగలడు’ అనే విషయాన్ని ఆమోదించరు. కాని ప్రయోగాలు అనుసరించి నిద్రకు ముందు నేర్చుకున్నది మిగిలిన సమయాల్లో నేర్చుకున్న దానికంటే బాగా గుర్తుంటుంది. కొంతమంది మానసిక శాస్తవ్రేత్తలు మనిషి స్మృతిలో లేని సమయంలో సమస్యలపై సాధన చేయడానికి మెదడు తయారుగా ఉంటుందని భావిస్తున్నారు.
సుప్తచేతనావస్థలో సామర్థ్యాలు
మన మెదడులో అంతులేని సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ సమాచారాన్ని చాలా అరుదుగా వినియోగించుకుంటాం. ఇది సుప్తచేతనావస్థలో వున్న మెదడులో దాగి ఉంటుంది. ఈ సుప్త చేతనావస్థలో మెదడు లోతుల్లోకి వెళ్లి కావల్సిన సమాచారాన్ని బయటకు లాగగల్గితే మనుషులు భగవత్ స్వరూపుల్లా దర్శనమిస్తారు. ఈ సమాచారం ఆవేశపూరితంగాను, భయంకరంగాను ఉంటుంది.

-సి.వి.సర్వేశ్వరశర్మ