విశాఖపట్నం

క్రిస్టమస్ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సికిందరాబాద్ - శ్రీకాకుళం రోడ్డు
* శ్రీకాకుళం రోడ్డు - తిరుపతి సూపర్‌ఫాస్ట్ రైళ్లు
విశాఖపట్నం, డిసెంబర్ 18: క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని రద్దీని నియంత్రించేందుకు రెండు సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పుకోస్తా రైలు నిర్ణయించింది. సికిందరాబాద్ - శ్రీకాకుళం రోడ్డు, శ్రీకాకుళం రోడ్డు - తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తూర్పుకోస్తా వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికిందరాబాద్ నుంచి ప్రత్యేక రైలు ఈ నెల 24వ తేదీ రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి 11.20 గంటలకు విశాఖలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. ఈ రైలు విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట స్టేషన్లలో ఆగుతుంది. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఒక సెకెండ్ ఎసి, మూడు థర్డ్ ఎసి, 12 స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి.