క్రీడాభూమి

రాయ్ సంచలన శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 30: కనింగ్టన్ ఓవల్ మైదానంలో శ్రీలంకతో జరిగిన నాలుగో వనే్డలో ఓపెనర్ జాసన్ రాయ్ సంచలన శతకాన్ని నమోదు చేసి, ఇంగ్లాండ్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ తరఫున ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డును సమం చేసే అవకాశాన్ని కేవలం ఐదు పరుగులతో చేజార్చుకున్నప్పటికీ, జట్టును విజయపథంలో నడిపించాడు. వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, సవరించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 42 ఓవర్లలో ఐదు వికెట్లకు 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. దుష్మంత గుణతిలక (62), కుశాల్ పెరీరా (77), దినేష్ చండీమల్ (63), కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (67 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించడంతో లంకకు ఈ స్కోరు సాధ్యమైంది. ఈ దశలో వర్షం కురవడంతో ఆటకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గిన తర్వాత, శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసినట్టు ప్రకటించిన అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఇంగ్లాండ్ విజయ లక్ష్యాన్ని 42 ఓవర్లలో 308 పరుగులుగా నిర్ణయించారు. ఓపెనర్ జాసన్ రాయ్ విజృంభణ ఇంగ్లాండ్‌కు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని సులభం చేసింది. 118 బంతులు ఎదుర్కొన్న అతను 13 ఫోర్లు, మూడు సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. జో రూట్ 65 పరుగులు చేసి, ఇంగ్లాండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 40.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 309 పరుగులు చేసిన ఇంగ్లాండ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో గెల్చుకుంది. చివరి వనే్డలో ఫలితం ఎలావున్నా సిరీస్ ట్రోఫీని ఇంగ్లాండ్ స్వీకరిస్తుంది.
జాసన్ రాయ్ ఇంగ్లాండ్ తరఫున ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండు స్థానాన్ని ఆక్రమించాడు. 1993లో ఆస్ట్రేలియాతో ఎడ్జిబాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో రాబిన్ స్మిత్ అజేయంగా 167 పరుగులతో నెలకొల్పిన రికార్డును సమం చేసే అవకాశాన్ని ఐదు పరుగుల తేడాతో కోల్పోయాడు.

చిత్రం.. జాసన్ రాయ్