క్రీడాభూమి

లోధా సిఫార్సుల అమలుపై సుప్రీం తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 30: భారత క్రికెట్ ప్రక్షాళనకు, పారదర్శక పాలనకు లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంపై తీర్పును సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వాదోపవాదాలు పూర్తికాగా, తీర్పును ప్రకటించలేదు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇది వరకే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి సూచించిన విషయం తెలిసిందే. అయితే, అందులోని పలు అంశాలు ఆచరణ యోగ్యం కావంటూ బిసిసిఐ వాదించింది. పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. లోధా ప్రతిపాదనలను అమలు చేయడంలో తలెత్తే వివిధ అంశాలను కోర్టు ముందుంచింది. ఈ సిఫార్సుల అమలుపై ప్రాసిక్యూషన్ కూడా తన వాదనలు వినిపించింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి పలు ఆరోపణల్లో కూరుకుపోయిన బిసిసిఐని ప్రక్షాళన చేయాలంటే తప్పనిసరిగా లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎవరికీ జవాబుదారి కాదన్న రీతిలో బిసిసిఐ వ్యవహరిస్తున్నదని, ఈ విధానానికి స్వస్తి పకాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసింది.

chitram లోధా