క్రీడాభూమి

ధోనీ స్థానం.. భర్తీ కావడం కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 1: టెస్టు క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడం అనుకున్నంత సులభం కాదని వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే టీమిండియాకు ఎంపికైన వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. అతని స్థానం భర్తీ కావడం కష్టమని అన్నాడు. మ్యాచ్ విన్నర్లలో ధోనీ ముందు వరుసలో ఉంటాడని, అంతటి సమర్థుడు లభించడం తేలిక కాదని అనీల్ కుంబ్లే పర్యవేక్షణలో శుక్రవారం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ సెషన్‌ను ముగించిన తర్వాత ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. జాతీయ జట్టుకు ధోనీ అందించిన సేవల స్థాయి ఏమిటో తనకు తెలుసునని అన్నాడు. అతని మాదిరిగానే ఉత్తమ సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పాడు. తనకు సమయం లభించిన ప్రతిసారీ ధోనీకి ఫోన్ చేసి, అతని సలహాలు, సూచనలు తీసుకుంటానని సాహా అన్నాడు. ధోనీతో తనకు సాన్నిహిత్యం ఉందని, చాలా సందర్భాల్లో అతను ఎన్నో సలహాలిచ్చాడని సాహా చెప్పాడు. వెస్టిండీస్ టూర్‌లో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. నిరుడు టీమిండియా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పిందని, అదే స్థాయి ఆటను ఇక ముందు కూడా కొనసాగిస్తుందని చెప్పాడు.