క్రీడాభూమి

టీమిండియా సిరీస్‌లకు రోడ్‌మ్యాప్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 3: భారత క్రికెట్ జట్టు పాల్గొనే వివిధ సిరీస్‌లలో అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన రోడ్‌మ్యాచ్‌పై ఆదివారం సుదీర్ఘ చర్చ జరిగింది. టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, భారత్ ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, క్రికెట్ పాలనా వ్యవహారాల జనరల్ మేనేజర్ ఎంవి శ్రీ్ధర్, నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సిఎ) బ్యాటింగ్ కోచ్ డబ్ల్యువి రామన్, స్పిన్ బౌలింగ్ కోచ్ నరేంద్ర హీర్వాణీ, ఫిజియో ఆండ్రూ లీపస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జట్టులో ఎవరైనా కీలక ఆటగాళ్లు గాయపడినా లేదా అందుబాటులో లేకపోయినా, వారి స్థానాలను భర్తీ చేయడానికి సమర్థులను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ధోనీ సూచించినట్టు సమాచారం. బోర్డు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం భారత్ ‘ఎ’ జట్టులోని ఆటగాళ్లపై దృష్టి కేంద్రీకరిస్తే ఈ విషయంలో సత్ఫలితాలు వస్తాయని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కుంబ్లే ఎక్కువగా స్పిన్ విభాగాన్ని బలోపేతం చేయడంపైనే ఆసక్తి చూపాడు. ప్రస్తుతం జట్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా మాత్రమే పేరొందిన స్పిన్నర్లు ఉన్నారని, వీరికి ప్రత్యామ్నాయంగా మరికొందరిని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, షాబాజ్ నదీం పేర్లను పరిశీలించారు. వీరిని సీనియర్లకు దీటుగా తయారు చేసే బాధ్యతను స్పిన్ బౌలింగ్ కోచ్ హీర్వాణీకి అప్పగించారు.
భారత క్రికెటర్లకు ఆటవిడుపు
భారత ఆటగాళ్లకు ఆదివారం సాయంత్రం ఆటవిడుపు లభించింది. కోచ్ అనిల్ కుంబ్లేసహా పలువురు క్రికెటర్లు ప్రముఖ నటి, సంగీత దర్శకురాలు వసుంధరా దాస్ ట్రూప్‌తో కలిసి డ్రమ్స్‌ను మోగిస్తూ కాలక్షేపం చేశారు. పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, భారత్ ‘ఎ’ జట్టు సభ్యుడు వరుణ్ ఆరోన్ తదితరులు ‘డ్రమ్‌జామ్’లో బిజీగా కనిపించారు. మిగతా వారంతా వారిని ఉత్సాహ పరుస్తూ కేరింతలు కొట్టారు.

చిత్రం.. బెంగళూరులో ఆదివారం జరిగిన కీలక భేటీలో టీమిండియా అనుసరించాల్సిన రోడ్‌మ్యాప్‌పై చర్చిస్తున్న చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్, టెస్టు కప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తదితరులు