క్రీడాభూమి

రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 3: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకుండానే నిష్క్రమించినందుకు తానేమీ కుంగిపోవడం లేదని ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ స్పష్టం చేశాడు. రెట్టించిన ఉత్సాహంతో దూసుకొస్తానని, భవిష్యత్తులో మళ్లీ విజయాల బాట పడతానని విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. మూడో రౌండ్‌లో అతను 6-7, 1-6, 6-3, 6-7 తేడాతో శామ్ క్వెర్రీ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయానికి కారణాలు ఏమిటని విలేఖరులు పదేపదే ప్రశ్నించగా, తన కంటే శామ్ చాలా బాగా ఆడాడని అన్నాడు. వర్షం కారణంగా పలుమార్లు ఆటకు అంతరాయం కలగడం కారణం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ సమస్య శామ్‌కు కూడా ఉందని, కాబట్టి కారణాలను వెతుక్కోవడం సరైన విధానం కాదని అన్నాడు. తన పరాజయానికి ఫలానా కారణం ఉందని చెప్పడం వల్ల శామ్ సామర్థ్యాన్ని కించపరచినట్టు అవుతుందని జొకోవిచ్ అన్నాడు. సర్వీసుల విషయంలో శామ్‌ను తాను అధిగమించలేకపోయానని అంగీకరించాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ తాను డేవిస్ కప్ టోర్నీలో పాల్గొనడం లేదని ప్రకటించాడు. తనకు కుటుంబం ఉందని, టెన్నిస్ వెలుపల తనకంటూ ఒక ప్రపంచం ఉందని వ్యాఖ్యానించాడు. చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని, వాటిపై దృష్టి పెడతానని చెప్పాడు.
మొత్తం మీద మూడుసార్లు, వరుసగా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్‌ను సాధించిన జొకోవిచ్ ఇటీవలే ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. చాలాకాలంగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఆ టైటిల్‌ను ఎట్టకేలకు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా ఓపెన్‌ను కూడా గెల్చుకున్న అతను వింబుల్డన్‌ను కూడా గెల్చుకోవడం ద్వారా 1969 తర్వాత మొదటిసారి క్యాలెండర్ శ్లామ్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకు వేయాలని అనుకున్నాడు. కానీ, మూడో రౌండ్‌లోనే అతని ప్రయత్నానికి శామ్ క్వెర్రీ రూపంలో బ్రేక్ పడింది. గత నాలుగు మేజర్ గ్రాండ్ శ్లామ్స్‌ను సాధించిన 29 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది అనూహ్య పరాజయంగానే చెప్పుకోవాలి. గత 28 గ్రాండ్ శ్లామ్ పోటీల్లో అతను క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరకుండానే నిష్క్రమించడం ఇదే మొదటిసారి. అంతేగాక, గత 31 గ్రాండ్ శ్లామ్ మ్యాచ్‌ల్లో అతను ఓడడం కూడా ఇదే తొలిసారి.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో నొవాక్ జొకోవిచ్