క్రీడాభూమి

సెరెనా ‘ట్రిపుల్ సెంచరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 3: ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి, వింబుల్డన్ మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ అరుదైన మైలు రాయిని చేరింది. కెరీర్‌లో ఆమె 300వ విజయాన్ని నమోదు చేసి, మార్టినా నవ్రతిలోవా తర్వాత ఈ ఫీట్ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుస్తకాల్లో చేరింది. నవ్రతిలోవా 306 విజయాలను సాధించగా, జర్మనీకి చెందిన అన్నీ బెక్‌ను 6-3, 6-0 తేడాతో చిత్తుచేసిన సెరెనా కెరీర్‌లో 300వ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆమె ఆల్‌టైమ్ విన్ జాబితాలో క్రిస్ ఎవర్ట్ లాయిడ్‌ను మూడో స్థానానికి నెట్టేసింది. వింబుల్డన్‌లో సెరెనాకు ఇది 82వ విజయం. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకొని, స్ట్ఫె గ్రాఫ్ రికార్డును సమం చేయాలన్న పట్టుదలతో ఉన్న సెరెనా తన ప్రయత్నంలో మరో అడుగు ముందుకేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేఖరులతో మాట్లాడూ కెరీర్‌లో ఇది 300వ విజయం అన్న విషయం తనకు గుర్తులేదని చెప్పింది. నిజానికి ఆ విషయాన్ని తాను ఆలోచించలేదని తెలిపింది. ఒక అరుదైన మైలురాయిని చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది.

చిత్రం.. సెరెనా విలియమ్స్