క్రీడాభూమి

గిరాడ్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూలై 4: ఆలివర్ గిరాడ్ రెండు గోల్స్‌తో రాణించగా ఐస్‌లాండ్‌తో జరిగిన యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌లో 5-2 తేడాతో నెగ్గిన ఫ్రాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్
మొత్తం దాదాపు ఏకపక్షంగా కొనసాగింది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడుతున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు ఆరంభం నుంచే దూకుడును కొనసాగించారు. 12వ నిమిషంలోనే గిరాడ్ తొలి గోల్ చేసి ఫ్రాన్స్‌ను ఆధిక్యంలో నిలిపాడు. 20వ నిమిషంల పాల్ పోగ్బా గోల్ చేయగా, 43వ నిమిషంలో దిమిత్రీ పాయెట్, మరో రెండు నిమిషాల్లోనే ఆంటోనీ గ్రీజ్మన్ గోల్స్ సాధించి ఫ్రాన్స్‌కు 4-0 ఆధిక్యాన్ని అందించారు. ఆరంభంలో ఎక్కువ సమయం రక్షణాత్మక విధానానికే ప్రాధాన్యతనిచ్చి, చాలా ఆలస్యంగా ఎదురుదాడికి దిగిన ఐస్‌లాండ్‌కు 56వ నిమిషంలో కోల్బెన్ సిగ్పార్సన్ ఒక గోల్‌ను అందించాడు. అయితే, ఐస్‌లాండ్ గోల్ చేసిన మూడు నిమిషాల వ్యవధిలో గిరాడ్ తన రెండో గోల్‌ను నమోదు చేశాడు. ఆతర్వాత ఫ్రాన్స్ దాడులను మానుకొని, డిఫెన్స్‌ను అనుసరించింది. ఇదే అవకాశంగా 84వ నిమిషంలో బిర్కిర్ జర్నాసన్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 5-2కు తగ్గించాడు. మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే వరకూ మరో గోల్ నమోదుకాలేదు. ఐస్‌లాండ్‌ను 5-2 తేడాతో ఓడించిన ఫ్రాన్స్ గురువారం జర్మనీతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. మరో సెమీఫైనల్ బుధవారం పోర్చుగల్, వేల్స్ జట్ల మధ్య జరుగుతుంది.