క్రీడాభూమి

కెనడా ఓపెన్ బాడ్మింటన్ టైటిల్ విజేత ప్రణీత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్గరీ (కెనడా), జూలై 4: భారత ఆటగాడు సాయి ప్రణీత్ ఇక్కడ జరిగిన కెనడా ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో 23 ఏళ్ల ప్రణీత్ 21-12, 21-10 ఆధిక్యంతో దక్షిణ కొరియాకు చెందిన లీ హ్యున్‌ను ఓడించాడు. గతంలో పలువురు మేటి ఆటగాళ్లను ఓడించి సంచలనం సృష్టించిన ఈ హైదరాబాదీ నిరుడు శ్రీలంక ఇంటర్నేషనల్, లాగోస్ ఇంటర్నేషనల్, నజీబ్ రజాక్ ఓపెన్, బంగ్లాదేశ్ ఓపెన్ బాడ్మింటన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది కెనడాలో తొలిసారి విజేతగా నిలిచాడు. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత పురుషుల డబుల్స్ జోడీగా పేరుతెచ్చుకున్న మనూ అత్రి, సుమీత్ రెడ్డి కెనడాలో విజయభేరి మోగించింది. వీరు ఫైనల్‌లో స్థానిక ఆటగాళ్లు ఆడ్రియన్ లియూ, టోబీ ఇంగ్‌పై 21-8, 21-14 తేడాతో విజయం సాధించారు. రియో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న వారిలో ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నది.