క్రీడాభూమి

యూరో 2016 సాకర్ జర్మనీకి ఫ్రాన్స్ సవాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెల్లే, జూలై 6: ప్రపంచ సాకర్ చాంపియన్ జర్మనీకి ఫ్రాన్స్ సవాళ్లు విసురుతోంది. గురువారం జరిగే యూరో 2016 చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో ఫ్రెంచ్ ఆటగాళ్లు స్వదేశంలో, వేలాది మంది అభిమానుల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. హోం గ్రౌండ్‌లో విజయం సాధించాలన్న పట్టుదల వారిలో కనిపిస్తున్నది. అయితే, వరల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకొని, ప్రపంచ మేటి జట్టుగా ఎదిగిన జర్మనీ తన స్థాయికి తగినట్టు రాణించేందుకు ప్రయత్నించనుంది. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలు లేదా సస్పెన్షన్ల కారణంగా సెమీ ఫైనల్‌కు అందుబాటులో లేరు. అయినప్పటికీ, ఆ జట్టులో సమర్థులు చాలా మందే ఉన్నారు కాబట్టి పోరు తీవ్ర స్థాయిలో ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. ప్రపంచ చాంపియన్ కాబట్టి జర్మనీపైనే ఒత్తిడి అధికంగా ఉంటుందని, దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఫ్రాన్స్ ఆలోచిస్తున్నది. స్వదేశంలో మ్యాచ్ ఆడుతున్న కారణంగా, అభిమానుల అంచనాలకు తగినట్టు రాణించాలన్న ఒత్తిడిలో ఫ్రాన్స్ ఉంటుందని, ఇదే అదనుగా దాడులకు ఉపక్రమించి విజయం సాధించాలన్నది జర్మనీ ఎత్తుగడ. కాగితంపై చూస్తే ఇరు జట్లు సమవుజ్జీగా కనిపిస్తున్నాయి. గాయాలు, బహిష్కరణల సమస్య లేకపోతే, జర్మనీ బలమైన జట్టుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆ జట్టు ఫ్రాన్స్‌కు సమానంగా ఉంది. దీనితో ఈ రెండు జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి.

అర్జెంటీనా సాకర్ కోచ్
మార్టినో రాజీనామా

బూనస్ ఎయిర్స్, జూలై 6: అర్జెంటీనా సాకర్ కోచ్ గెరార్డో మార్టినో తన పదవికి రాజీనామా చేశాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం (ఎఎఫ్‌ఎ) ఆర్థికంగా చితికిపోయిందని, ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆటగాళ్లకు సరైన శిక్షణ అందించే అవకాశం కూడా లేకపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో తాను కోచ్‌గా కొనసాగలేనని మార్టినో తన రాజీనామా పత్రంలో పేర్కొన్నాడు. అయితే, మార్టినో వ్యాఖ్యల్ని ఎఎఫ్‌ఎ ఖండించింది. 2014 నుంచి కోచ్ వ్యవహరిస్తున్న అతను రాజీనామా చేసిన విషయాన్ని ధ్రువీకరించింది. కానీ, అతను చెప్పినట్టు ఆర్థికపరమైన ఇబ్బందులేవీ లేవని స్పష్టం చేసింది. అంతేగా, అతని స్థానంలో జూలియో ఒలార్టికొచేను కోచ్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. 1986లో వరల్డ్ కప్ గెల్చుకున్న అర్జెంటీనా జట్టులో ఒలార్టికొచే డిఫెండర్‌గా ఆడాడు. జాతీయ యూత్ జట్లకు అతను కోచ్‌గా వ్యవహరించాడు. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో తక్షణమే కొత్త కోచ్‌ని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఎఎఫ్‌ఎ తెలిపింది. అనుభవజ్ఞుడైన ఒలార్టికొచే అర్జెంటీనా జాతీయ జట్టుకు ఉత్తమ సేవలు అందిస్తాడని ధీమా వ్యక్తం చేసింది.