క్రీడాభూమి

వేల్స్ ఆశలకు రొనాల్డో గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లియాన్, జూలై 7: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ సెమీఫైనల్‌లో స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ‘రికార్డు’ గోల్ చేసి తన జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మొట్టమొదటిసారి ఒక మేజర్ టోర్నీలో సెమీస్ చేరిన వేల్స్ ఫైనల్‌లో అడుగుపెట్టడం ద్వారా మరో రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని ఆశించింది. కానీ, వేల్స్ ఆశలకు రొనాల్డో గండికొట్టాడు. సుమారు 50,000 మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే పోర్చుగల్, వేల్స్ జట్లు వ్యూహాత్మక డిఫెన్స్ విధానాన్ని అనుసరించాయి. దాడులకు ఉపక్రమించకుండా రక్షణాత్మకంగా ఆడుతూ సాధ్యమైనంత ఎక్కువ కాలాన్ని మింగేశాయి. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో దాదాపు సగం సమయం ఇదే విధంగా డ్రిబ్లింగ్, ఇంటర్నల్ పాసింగ్‌లతో గడిచిపోయింది. ఇటలీపై పెనాల్టీ షూటౌట్‌లో నెగ్గిన పోర్చుగల్ మరోసారి అదే పరిస్థితిని సృష్టించి, ఆతర్వాత విజయం కోసం ప్రయత్నిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, 50వ నిమిషంలో రొనాల్డో కీలక గోల్ చేసి, పోర్చుగల్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. యూరో చాంపియన్‌షిప్స్‌లో అతనికి ఇది తొమ్మిదో గోల్. అత్యధిక గోల్స్ జాబితాలో అతను ఫ్రాన్స్ మాజీ ఆటగాడు మైఖేల్ ప్లాటినీతో కలిసి నంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాడు. కాగా, పోర్చుగల్‌కు మొదటి గోల్‌ను సాధంచిపెట్టిన రొనాల్డో మరో మూడు నిమిషాల వ్యవధిలోనే బంతిని ఎంతో నేర్పుతో నానికి పాస్ అందించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాని గోల్ చేయడంతో పోర్చుగల్ ఆధిక్యం 2-0కు చేరింది. అనంతరం ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, చివరికి అదే తేడాతో విజయం సాధించింది. పోర్చుగల్ యూరో చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్ చేరడం ఇది రెండోసారి. 2004లో మొదటిసారి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సంతృప్తి చెందింది.

చిత్రం.. క్రిస్టియానో రొనాల్డో