క్రీడాభూమి

భారత మహిళా హాకీ కెప్టెన్ రితూ రాణిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 9: భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రితూ రాణిపై వేటు పడింది. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టులో సెలక్టర్లు ఆమెకు స్థానం కల్పించలేదు. భారత మహిళలు 36 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రితూ నాయకత్వంలోనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. జట్టుకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకాన్నిచ్చిన రితూను జట్టు నుంచి తొలగిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే, బెంగళూరులో జరిగిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఆమె మెరుగైన ప్రమాణాలను అందుకోలేకపోయిందని క్యాంప్ అధికారి ఒకరు తెలిపాడు. సరిగ్గా ఆడకపోవడం, మొండి వైఖరిని ప్రదర్శించడం వంటి కారణాలవల్లే ఆమెకు ఒలింపిక్స్‌కు వెళ్లే జట్టులో స్థానం లేకుండా చేశాయని అతను పిటిఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. 24 ఏళ్ల రితూ రెండు రోజుల క్రితమే క్యాంప్‌ను విడిచి వెళ్లిపోయిందని అతను ధ్రువీకరించాడు. మిగతా క్రీడాకారిణులు రెండు రోజుల విశ్రాంతి అనంతరం ఢిల్లీకి వెళతారని, అక్కడ మరోసారి వారికి శిక్షణ శిబిరం ఉంటుందని వివరించాడు. ఇలావుంటే, రితూ స్థానంలో జట్టును రాణి రాంపాల్ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రితూ తర్వాత రాణినే జట్టులో సీనియర్ క్రీడాకారిణి కావడంతో ఆమెవైపే సెలక్టర్లు మొగ్గు చూపవచ్చు.

చిత్రం.. రితూ రాణి