క్రీడాభూమి

టెన్నిస్‌కే ముర్రే ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: ముర్రే తల్లిపేరు జూడిత్. తండ్రి విలియమ్ ముర్రే. స్కాట్‌లాండ్‌లో జన్మించిన అతను డుబ్లేన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అదే సమయంలో తన అన్న జమీ ముర్రేతో కలిసి టెన్నిస్ ఆడడం మొదలు పెట్టాడు. జూడిత్ స్వయంగా టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె తండ్రి రాయ్ ఎర్స్‌కిన్ 1950 దశంలో ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా పేరుతెచ్చుకున్నాడు. దీనితో ముర్రేకు ఫుట్‌బాల్, టెన్నిస్‌లో ఏదో ఒక ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. అన్నతో కలిసి టెన్నిస్ ఆడడంపైనే అతను దృష్టి పెట్టాడు. సోలిహల్ టెన్నిస్ అండర్-12 విభాగంలో తన అన్న జమీని ఓడించి టైటిల్ సాధించడం ముర్రేకు తొలి విజయం. అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రేంజర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో చేరే అవకాశం లభించింది. కానీ, ఆ ప్రతిపాదనను తిరస్కరించిన ముర్రే టెన్నిస్‌కే అంకితమయ్యాడు. ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆరంభించిన తర్వాత పలు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్న అతను ట్రైనింగ్ విధానాన్ని మార్చుకున్నాడు. బార్సిలోనాకు వెళ్లి సాంచెస్ కాజల్ అకాడెమీలో చేరాడు. అక్కడ మాజీ ఆటగాడు ఎమిలియో సాంచెజ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేశాడు. చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న ముర్రే గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లోనేగాక, ఒలింపిక్స్‌లో, డేవిస్ కప్‌లోనూ టైటిళ్లను గెల్చుకున్నాడు. 2015 యుఎస్ ఓపెన్‌ను మినహాయిస్తే, 2011 నుంచి ఇప్పటి వరకూ తాను పాల్గొన్న ప్రతి గ్రాండ్ శ్లామ్‌లోనూ కనీసం క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం అతని ప్రతిభకు నిదర్శనం. 2012లో యుఎస్ ఓపెన్‌ను, 2013లో వింబుల్డన్‌ను సాధించిన ముర్రే, 2014 వింబుల్డన్‌లో, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకూ వెళ్లాడు. ఇప్పుడు అతని ఖాతాలో మొత్తం 38 టైటిళ్లు ఉన్నాయి.