క్రీడాభూమి

అశ్విన్ మినహా.. బౌలర్లు విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 17: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టుతో జరిగిన రెండవ సన్నాహక మ్యాచ్‌లో చివరి రోజు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినహా భారత బౌలర్లు ఎవరూ సరిగా రాణించలేకపోయారు. దీంతో తొలి సన్నాహక మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు కరీబియన్లను 180 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటై 184 పరుగుల ఆధిక్యత సాధించగా, శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి డబ్ల్యుఐసిబి ప్రెసిడెంట్స్ ఎలెవెన్ రెండో ఇన్నింగ్స్‌లో 1 వికెట్ నష్టపోయి 26 పరుగులు సాధించింది. ఆ స్కోరుతో శనివారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య జట్టులో నైట్ వాచ్‌మన్ జాన్ క్యాంప్‌బెల్ 31 పరుగులు సాధించి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ చేతికి చిక్కగా, మరో నైట్ వాచ్‌మన్ షాయి హోప్ (17) అశ్విన్ బౌలింగ్‌లో కోహ్లీకి దొరికిపోయాడు. ఈ తరుణంలో జెర్మయిన్ బ్లాక్‌వుడ్ (51) భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి అర్ధశతకాన్ని నమోదు చేసుకోగా, విశాల్ సింగ్ (39), మోంట్‌సిన్ హాడ్జ్ (39-నాటౌట్), రకీమ్ కార్న్‌వాల్ (21), వికెట్ కీపర్ జామర్ హామిల్టన్ (6-నాటౌట్) తమవంతు రాణించారు. దీంతో చివరి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టు 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టపోయి 223 పరుగులు సాధించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ 59 పరుగులిచ్చి 3 వికెట్లు, మొహమ్మద్ షమీ 22 పరుగులకు ఒక వికెట్, రవీంద్ర జడేజా 42 పరుగులకు ఒక వికెట్ సాధించగా, శార్థూల్ ఠాకూర్ 12 ఓవర్లలో 26 పరుగులు, అమిత్ మిశ్రా 9 ఓవర్లలో 17 పరుగులు, స్టూవర్ట్ బిన్నీ 8 ఓవర్లలో 11 పరుగులు, మురళీ విజయ్ 9 ఓవర్లలో 34 పరుగులు, చటేశ్వర్ పుజార 3 ఓవర్లలో 10 పరుగులు సమర్పించుకున్నారు.
సంక్షిప్తంగా స్కోర్లు
డబ్ల్యుఐసిబి ప్రెసిడెంట్స్ ఎలెవెన్ తొలి ఇన్నింగ్స్: 180 ఆలౌట్.
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 364 ఆలౌట్.
డబ్ల్యుఐసిబి రెండో ఇన్నింగ్స్: 223/6 (క్యాంప్‌బెల్ 31, జాన్సన్ 17, హోప్ 17, బ్లాక్‌వుడ్ 51, విశాల్ సింగ్ 39, హాడ్జ్ 39-నాటౌట్, కార్న్‌వాల్ 21, హామిల్టన్ 6-నాటౌట్). వికెట్ల పతనం: 1-26, 2-60, 3-70, 4-132, 5-174, 6-213.
టీమిండియా బౌలింగ్: అశ్విన్ 3/59, షమీ 1/22, రవీంద్ర జడేజా 1/42, శార్థూల్ ఠాకూర్ 0/26, అమిత్ మిశ్రా 0/17, స్టూవర్ట్ బిన్నీ 0/11, మురళీ విజయ్ 0/34, చటేశ్వర్ పుజారా 0/10.