క్రీడాభూమి

రోహిత్, జడేజా అవుట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానున్న తొలి టెస్టుకు తుది జట్టును ఎంపిక చేయడమే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెద్ద సవాలు కానుంది. ఎందుకంటే తొలి టెస్టుకు ముందు జరిగిన రెండు వామప్ మ్యాచ్‌లలో స్పిన్నర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాణించినప్పటికీ, మిడిలార్డర్, అలాగే ఫాస్ట్ బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.ఈ నేపథ్యంలో తొలి టెస్టులో ఆడే పదకొండు మంది ఆటగాళ్లు ఎవరై ఉంటారన్నది పెద్ద సస్పెన్స్‌గా మారింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై జట్టులో అయిదుగురు బౌలర్లు ఉండాలని కోరుకునే కోహ్లీ ఈ ఏ బౌలర్‌కు ప్రాధాన్యత ఇస్తాడో అర్థం కావడం లేదు. ఎందుకంటే వెస్టిండీస్ పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌లుగా పేరుబడ్డాయి. ఆ లెక్కన చూస్తే భారత జట్టులో ఇశాంత్ శర్మ తర్వాత పెద్దగా అంతర్జాతీయ అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు లేరనే చెప్పాలి. అంతో ఇంతో అనుభవం ఉన్న మహమ్మద్ షమీ, భువనేశ్వర్ ప్రసాద్‌లతో పాటుగా కొత్తగా జట్టులో స్థానం పొందిన శార్దూల్ ఠాకూర్‌లలో ఇద్దరికే స్థానం లభించే అవకాశం ఉంది. ఇక నాలుగో బౌలర్‌గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానానికి పోటీ లేదు. ఇక అయిదో బౌలర్ స్థానానికి కోహ్లీ జట్టులో ఏకైక లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల్లో ఒకరిని తీసుకుంటాడా, లేక ఫాస్ట్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీకి అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. ఇక వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు జట్టులో పోటీ లేదు.
మరోవైపు ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌లు ఇద్దరూ వామప్ మ్యాచ్‌లలో అర్ధ సెంచరీలు చేయడంతో విజయ్‌కు జోడీగా రెండోస్థానం కోసం ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పదనిపిస్తోంది. వైస్ కెప్టెన్ అజింక్య రహానే, కోహ్లీలు మూడు, నాలుగు స్థానాలనుభర్తీ చేయనుండగా, అయిదో బ్యాట్స్‌మన్‌గా ఎవర్ని తీసుకోవాలన్నదే చిక్కు ప్రశ్న. ఎందుకంటే గత ఏడాది శ్రీలంక పర్యటనలో తొలి రెండు టెస్టులకు చేతేశ్వర్ పుజారాకన్నా కూడా రోహిత్ శర్మకే కోహ్లీ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే మూడో టెస్టులో ఓపెనర్ విజయ్ గాయపడ్డంతో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం పుజారాకు లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులతో నాటౌట్‌గా నిలవడమే కాకుండా ఇప్పుడు రోహిత్ శర్మ స్థానానికి ఎసరు పెట్టేట్లు కనిపిస్తున్నాడు. రోహిత్ గొప్ప ఆటగాడే కానీ, కీలక సమయాల్లో రాష్ షాట్లు కొట్టడం, అలాగే నిలకడ లేమి అతనికి మైనస్ పాయింట్లుగా మారుతున్నాయి. ఈ లెక్కన చూస్తే తొలి టెస్టులో రాహుల్, రోహిత్, జడేజా,్ఠకూర్‌లు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ నెల 21నుంచి భారత్-వెస్టిండీస్‌ల మధ్య తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ లెజండ్ వివియన్ రిచర్డ్స్ సోమవారం టీమిండియా బస చేసిన హోటల్‌కు వెళ్లాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆటగాళ్లకు రోల్ మోడల్ అయిన రిచర్డ్స్ తమ హోటల్‌కు రావడంతో ఉబ్బి తబ్బిబ్బయిన కోహ్లీ, శిఖర్‌ధావన్, రహానే తదితరులు అతనితో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా రిచర్డ్స్ తమకెన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడంటూ కోహ్లీ సోషల్ మీడియాలో ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు.