క్రీడాభూమి

‘డబుల్’తో కోహ్లీ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 22: కరీబియన్లతో నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. ఆతిథ్య వెస్టిండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటుకున్న కోహ్లీ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకోవడంతో పాటు సరికొత్త రికార్డు సృష్టించాడు. అతనికి తోడు రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (84) అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని గురువారం తొలి రోజే సెంచరీ నమోదు చేసుకున్న కోహ్లీ (ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 143 పరుగులు) మరో నైట్ వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ (ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 22 పరుగులు)తో కలసి శుక్రవారం రెండో రోజు టీమిండియా ఇన్నింగ్స్‌ను సమర్ధవంతంగా ముందుకు నడిపాడు. విండీస్ బౌలర్లు మరోసారి కొత్త బంతిని ఎంచుకున్నప్పటికీ ఏమాత్రం వెరవకుండా 208 బంతుల్లో 150 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఆ తర్వాత జోరు మరింత పెంచిన కోహ్లీకి అశ్విన్ అద్భుతమైన సహకారాన్ని అందించాడు. దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్న కోహ్లీ విండీస్ బౌలర్ల భరతం పడుతూ స్కోరు బోర్డును పరుగులు తీయించగా, అశ్విన్ కూడా చక్కగా రాణించి 127 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. చక్కటి సమన్వయంతో పూర్తిగా ఒక సెషన్ మొత్తం ఆడిన వీరు మధ్యాహ్న భోజన విరామ సమయానికి అజేయంగా 168 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే భోజన విరామ సమయానికి ముందు చివరి బంతికి ఒక పరుగును రాబట్టడం ద్వారా 281 బంతుల్లో 200 పరుగులు సాధించిన కోహ్లీ టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకోవడంతో పాటు విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత జట్టు కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో 1990 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అప్పటి భారత జట్టు కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ 192 పరుగులతో నెలకొల్పిన రికార్డు చెరిగిపోయింది. అయితే భోజన విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభం కాగానే కోహ్లీ అదే స్కోరు వద్ద షానన్ గాబ్రియెల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించాడు. దీంతో భారత జట్టు 404 పరుగుల స్కోరు వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కోహ్లీ స్థానంలో బరిలోకి దిగిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తన వంతు రాణించి 88 బంతుల్లో 40 పరుగులు సాధించడంతో ఆరో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్య నమోదైంది. సాహా నిష్క్రమణ అనంతరం 237 బంతుల్లో సెంచరీ నమోదు చేసుకున్న అశ్విన్ (103), అమిత్ మిశ్రా (17) అజేయంగా నిలువడంతో కడపటి వార్తలు అందే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది.