క్రీడాభూమి

రియోలో పతకమే లక్ష్యం : దుతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 26: తన రెండేళ్ల చీకటి రోజులను మరిచిపోయి, తనలాగే వివక్షను ఎదుర్కొనే వేలాది మంది అమాయకులకోసం రియోలో పతకం సాధించడమే తన లక్ష్యమని ఒలింపిక్స్‌లో వంద మీటర్ల స్ప్రింట్‌లో భారత్ తరఫున ఎంపికయిన రెండో మహిళ దుతీ చాంద్ అంటోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పిటి ఉష వందమీటర్లు, 200 మీటర్ల స్ప్రింట్‌లో పోటీ పడిన తర్వాత మన దేశంనుంచి ఒలింపిక్స్‌కుఈ విభాగంలో ఎంపికయిన రెండో మహిళ దుతి కావడం గమనార్హం. ‘జీవితంలో సవాళ్లకు నేను ఎంతమాత్రం భయపడను. పోటీ ఎంత తీవ్రమైతే అంతగా నా టైమింగ్ మెరుగుపడుతుంది’ అని రెండేళ్ల క్రితం పురుష హార్మోన్ టెస్టోస్టిరోన్ లెవల్స్ అధికంగా ఉన్నాయన్న కారణంగా నిషేదానికి గురయిన దుతి హైదరాబాద్‌నుంచి పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘ప్రతి ఒక్కరి జీవితంలోను ఎగుడుదిగుళ్లు ఉంటాయి. నాకు సంబంధించినంతవరకు గతమంతా చీకటే. దాని వెనక్కి తిరిగి చూసుకోవాలని అనుకోవడం లేదు. రియోలో రాణించడం ఒక్కటి గురించే నా ఆలోచనంతా’ అని దుతి చెప్పింది.
6న బిసిసిఐ ప్రత్యేక ఎజిఎం
న్యూఢిల్లీ, జూలై 26: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై చర్చించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) తన అనుబంధ సంఘాలతో ఆగస్టు 5న ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు బిసిసిఐ నుంచి ఇ-మెయిల్ అందినట్లు ఓ రాష్ట్ర సంఘం సభ్యుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఆగస్టు 9న బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలు లోధా కమిటీని కలవడానికి ముందే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడంతో పాటు సిఫార్సుల అమలులో ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందులను సభ్యుల నుంచి తెలుకోవడమేనని తెలుస్తోంది.
తొలి రోజే 12 వికెట్లు
శ్రీలంక 117 ఆలౌట్
పల్లికల్, జూలై 26: ఆస్ట్రేలియా-శ్రీలంక జట్ల మధ్య నాలుగు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా మంగళవారం పల్లికల్‌లో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో కనీసం 55 ఓవర్ల ఆట పూర్తికాకపోయినప్పటికీ మొదటి రోజే 12 వికెట్లు కూలాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య శ్రీలంక జట్టును ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్ లియోన్ (3/12), జోష్ హాజెల్‌వుడ్ (3/21), స్టీవ్ ఓకీఫీ (2/32), మిచెల్ స్టార్క్ (2/51) చావుదెబ్బ తీశారు. దీంతో 34.2 ఓవర్లకే కుదేలైన శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో కూడా ఓపెనర్లు జో బర్న్స్ (3), డేవిడ్ వార్నర్ (0) త్వరత్వరగా నిష్క్రమించారు. అయితే ఉస్మాన్ ఖ్వాజా (25), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (28) క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిద్దరూ కలసి 59 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి 20 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు నష్టపోయి 66 పరుగులు చేసింది.