క్రీడాభూమి

ఒలింపిక్ విలేజ్ పార్కింగ్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, జూలై 30: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రేలియా బృందం బస చేసిన ఒలింపిక్ విలేజ్‌లోని ఓ భవనం పార్కింగ్ ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనితో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వారిని మరో హోటల్‌కు తరలించారు. బృందంలో వందకుపైగా అథ్లెట్లు, అధికారులు ఉన్నారు. ఆస్ట్రేలియా జట్టు బస చేసిన ఆ భవనంలోని బేస్‌మెంట్ పార్కింగ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగ వ్యాపించింది. ఎలాంటి ప్రమాదం తలెత్తకపోయినా, ముందు జాగ్రత్తగా ఆస్ట్రేలియా బృందాన్ని తరలించిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే రియో పలు సమస్యలతో అల్లాడుతున్నది. ఒలింపిక్స్ టికెట్ల అమ్మకం నత్తనడకన సాగుతున్నది. వైద్యులు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు తమతమ డిమాండ్లపై నిరసనలకు దిగుతున్నారు. జికా వైరస్ ప్రపంచ అథ్లెట్లను భయపెడుతున్నది. కొన్ని ఒలింపిక్ కేంద్రాల వద్ద పనులు ఇంకా పూర్తికాలేదు. ఎప్పుడు తుది మెరుగులు దిద్దుకొని, అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి. ఇన్ని సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఉక్కిబిక్కిరవుతున్న అధికారులకు అగ్నిప్రమాద సంఘటన కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. పెద్దగా నష్టమేమీ జరగకపోయినా, ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయేమోనన్న అనుమానం వ్యక్తమవుతున్నది. ఒకవేళ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తున్నది. రియో నగర మేయర్ ఎడ్యురార్డో పేస్ స్వయంగా రంగంలోకి దిగి, ఏర్పాట్లను పరిశీలిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నాడు.