క్రీడాభూమి

నిర్భయంగా వెళ్లి.. పతకం తీసుకురా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: డోపింగ్ వ్యవహారంలో సోమవారం నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) నుంచి క్లీన్‌చిట్ పొందిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నాడు. పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఇకమీదట ఎటువంటి భయాందోళనకు గురికాకుండా రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి దేశానికి కీర్తిని తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్‌కు సూచించారు. నర్సింగ్‌కు ఎటువంటి అన్యాయం జరగదని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం నర్సింగ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధాని తనకు శుభాకాంక్షలు తెలియజేశారని, ఎటువంటి ఆందోళనకు గురికాకుండా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని దేశానికి పతకాన్ని తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా సూచించారని తెలిపాడు. నర్సింగ్ యాదవ్ ఇటీవల డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందని అతను పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై సుదీర్ఘ విచారణ జరిపిన నాడా విచారణ కమిటీ సంశయ లాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద అతనికి సోమవారం క్లీన్‌చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేసి రియో ఒలింపిక్ క్రీడల్లో పతకాన్ని సాధించడం దృష్టి కేంద్రీకరిస్తానని నర్సింగ్ యాదవ్ స్పష్టం చేశాడు. ‘ఈ వ్యవహారంలో నాకు అండగా నిలిచిన ప్రధాని మోదీతో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రియో ఒలింపిక్స్‌లో చక్కగా రాణించి నాపై పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తానని ఆశిస్తున్నా’ అని నర్సింగ్ యాదవ్ తెలిపాడు. డోపింగ్ వివాదానికి వెనుక ఉన్న కుట్రదారులను శిక్షించాలని కోరుకుంటున్నావా? అని విలేఖర్లు ప్రశ్నించగా, దీనిపై దర్యాప్తు జరుగుతోందని, తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని నర్సింగ్ యాదవ్ చెప్పాడు. నర్సింగ్ యాదవ్‌తో పాటు బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కూడా ప్రధాన మంత్రిని కలుసుకున్నాడు.
నర్సింగ్ కేసును సమీక్షిస్తాం : వాడా
ఇదిలావుంటే, డోపింగ్ వ్యవహారంలో నాడా నుంచి క్లీన్‌చిట్ పొందిన నర్సింగ్ యాదవ్ కేసుపై సమీక్ష జరుపుతామని వాడా మంగళవారం స్పష్టం చేసింది. ఈ కేసులో నర్సింగ్ యాదవ్‌కు సంబంధించిన ఫైల్‌ను తమకు పంపాల్సిందిగా నాడాకు విజ్ఞప్తి చేశామని వాడా సమాచార విభాగ సమన్వయకర్త మ్యాగీ డ్యూరాండ్ తెలిపారు. నర్సింగ్ యాదవ్‌కు క్లీన్‌చిట్ ఇస్తూ నాడా తీసుకున్న నిర్ణయాన్ని రియో డీ జెనిరోలోని తాత్కాలిక క్రీడా మధ్యవర్తిత్వ కోర్టులో సవాలు చేస్తారా? అని ప్రశ్నించగా, నర్సింగ్ కేసును సమీక్షించేందుకు అతని ఫైల్‌ను పంపాల్సిందిగా నాడాను కోరామని, ప్రస్తుతానికి ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేనని పిటిఐ వార్తా సంస్థకు డ్యూరాండ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతో రియో ఒలింపిక్స్‌లో తన భవితవ్యం ఏమిటన్నదీ తెలియాలంటే నర్సింగ్ మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

chitram...

ప్రధాని మోదీని కలసిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతున్న నర్సింగ్