క్రీడాభూమి

హాకీ గత కీర్తి ఘనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఒలింపిక్స్‌లో భారత హాకీ గత కీర్తి ఎంతో ఘనం. నేడు అది అంతంత మాత్రం. ఒకప్పుడు ప్ర పంచాన్ని శాసించిన భారత హాకీ నేడు ఉనికి కోసం అల్లా డుతున్నది. ఒలింపిక్స్‌లో మన ప్రస్థానం సాగిన తీరును చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఒలింపిక్స్‌లో అంతకు ముందు మూడు పర్యాయాలు స్వర్ణ పతకాలు సాధించినా అప్పటి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు. బ్రిటిషర్ల పాలనలోలోనే 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత్ స్వతంత్ర దేశంలో 1948 లండన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి అడుగుపెట్టింది. అప్పటికే ధ్యాన్ చంద్, రూప్ సింగ్ వంటి మేటి ఆటగాళ్లు రిటైరయ్యారు. 1932 ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఎఐఎస్ దారా దేశ విభజన కాలంలో పాకిస్తాన్‌కు వెళ్లి, ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. అతనితోపాటు పాల్ పీటర్ ఫెర్నాండెజ్, అక్తర్ హుస్సేన్, లతీఫ్-ఉర్-రెహ్మాన్ కూడా పాకిస్తాన్‌కు వలస వెళ్లడంతో భారత జట్టు మొత్తం కొత్త ఆటగాళ్లతో నిండిపోయింది. వీరిలో ఎవరికీ అంతకు ముందు ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం లేదు. కానీ, స్వేచ్ఛావాయువులు ఆటగాళ్లలో నూతన తేజాన్ని నింపాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రియాను 8-0 తేడాతో చిత్తుచేసిన భారత జట్టు ఆతర్వాత అర్జెంటీనాను 9-1 తేడాతో, స్పెయిన్‌ను 2-0, హాలెండ్‌ను 2-1 ఆధిక్యంతో ఓడించి, ఫైనల్ చేరింది. లీగ్, సెమీస్ దశలను పూర్తి చేసుకొని బ్రిటన్ కూడా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. 1948 సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్‌లో బ్రిటన్‌ను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టిన భారత ఆటగాళ్లు నాలుగు సార్లు లక్ష్యాన్ని ఛేదించారు. 4-0 తేడాతో బ్రిటన్‌ను ఓడించారు. బల్బీర్ సింగ్ సీనియర్ రెండు గోల్స్ చేయగా, పాట్ జానె్సన్, త్రిలోచన్ సింగ్ చెరొగ గోల్ కొట్టారు. ఒలింపిక్స్‌లో భారత్ స్వతంత్య్ర దేశంగా తొలి స్వర్ణానాన్ని, మొత్తం మీద వరుసగా నాలుగో టైటిల్‌ను అందుకుంది.
బల్బీర్ మాయాజాలం
హెల్సిన్కీలో జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బల్బీర్ సింగ్ సీనియర్ మరోసారి తన మాయాజాలంతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ధ్యాన్ చంద్ వారసత్వాన్ని కొనసాగించిన అతను కీలక విజయాలను సాధించిపెట్టాడు. ఆస్ట్రియాను 4-0, బ్రిటన్‌ను 3-1 తేడాతో ఓడించిన భారత్ ఒలింపిక్స్‌లో వరుసగా ఐదోసారి ఫైనల్ చేరింది. హాలెండ్‌ను ఫైనల్‌లో 6-1 స్కోరుతో చిత్తుచేసి టైటిల్ అందుకుంది. ఈ పోటీల్లో భారత్ సాధించిన మొత్తం 13 గోల్స్‌లో బల్బీర్ సింగ్ ఒక్కడు సాధించినవే తొమ్మిది గోల్స్. ఫైనల్‌లోనూ అతను ఐదు గోల్స్‌తో కదం తొక్కాడు. మన దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా చిన్నదొరై దేశముత్తు రికార్డు సృష్టించాడు. ఒలింపిక్ మ్యాచ్ ఆడే సమయానికి అతని వయసు 19 సంవత్సరాల 272 రోజులు.
డబుల్ హ్యాట్రిక్
భారత హాకీ జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం ద్వారా డబుల్ హ్యాట్రిక్ సాధించింది. వరుసగా ఆరోసారి విజేతగా నిలిచి రికార్డు నెలకొల్పింది. ఒలింపిక్స్ చరిత్రలోనే ఒక క్రీడలో ఈ విధంగా ఆరుసార్లు విజేతగా నిలిచిన జట్టు మరొకటి లేదు. గ్రూప్ మ్యాచ్‌లలో అఫ్ఘానిస్థాన్‌ను 14-0, అమెరికాను 16-0, సింగపూర్‌ను 6-0 తేడాతో ఓడించింది. సెమీ ఫైనల్‌లో జర్మనీపై నెగ్గి, మొట్టమొదటిసారి పాకిస్తాన్‌తో ఫైనల్‌లో ఢీకొని విజయభేరి మోగించింది. వరుసగా ఆరోసారి ఒలింపిక్ విజేతగా అవతరించింది. ఉద్ధమ్ సింగ్ 15 గోల్స్ సాధించి సంచలనం సృష్టించాడు.
ఆశా కిరణాలు
ఆరు సార్లు వరుస విజయాలతో కొత్త ఒరవడికి బీజం వేసిన భారత హాకీ జట్టు 1960 రోమ్ ఒలింపిక్స్‌లో అదే స్థాయిలో రాణించలేకపోయింది. దాయాది పాకిస్తాన్ చేతిలో ఫైనల్‌లో ఓటమిపాలై రజత పతకంతో సంతృప్తి చెందింది. హాకీ పతనమవుతున్నదని అభిమానులు నిరాశ చెందుతున్న తరుణంలో 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ స్వర్ణాన్ని అందుకొని భవిష్యత్తుపై ఆశలు రేపింది. బెల్జియం, హాంగ్‌కాంగ్, మలేసియా, కెనడా, హాలెండ్ జట్లను ఓడించి, జర్మనీ, స్పెయిన్‌లతో డ్రా చేసుకొని, మొత్తం మీద 12 పాయింట్లతో పూల్ మ్యాచ్‌లలో టాపర్‌గా నిలిచింది. ఫైనల్‌లో మరోసారి పాకిస్తాన్‌తోనే టైటిల్ పోరుకు దిగింది. చివరి క్షణం వరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలుపొంది, రోమ్స్ ఒలింపిక్స్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఏడోసారి ఒలింపిక్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
మాస్కోలో మనమే గొప్ప..
చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షమని సామెత. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌ను ఆ అదృష్టమే వరించింది. 1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో దారుణంగా విఫలమై, కాంస్య పతకాలకు పరిమితమైన భారత హాకీ జట్టుకు 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించే అవకాశాలు లేనేలేవు. కానీ, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొమ్మిది జట్లు రాజకీయ కారణాల వల్ల మాస్కో ఒలింపిక్స్‌కు హాజరుకాలేదు. వీటిలో, మాంట్రియల్‌లో స్వర్ణం సాధించిన న్యూజిలాండ్, రజత పతక విజేత ఆస్ట్రేలియా, కాంస్య పతకాన్ని గెల్చుకున్న పాకిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. యూరోపియన్ హాకీ పవర్ హౌస్ జర్మనీతోపాటు హాలెండ్, గ్రేట్ బ్రిటన్ కూడా మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించాయి. సామర్థ్యం ఉన్న జట్లు ఏవీ లేకపోవడంతో, అదృష్టం కలిసొచ్చి భారత్ స్వర్ణ పతకాన్ని సాధించగలిగింది.
భంగపాటు..
ఒలింపిక్స్‌లో పాల్గొనడం ప్రారంభించిన 1928 నుంచి 2004 వరకూ క్రమం తప్పకుండా పాల్గొన్న భారత హాకీ జట్టు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత కూడా సంపాదించలేకపోయింది. హాకీ ప్రమాణాలు ఎంతగా దిగజారాయో ఈ పరిణామం స్పష్టం చేస్తుంది. హాకీని జాతీయ క్రీడగా ప్రకటించుకున్నా... హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించుకున్నా పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సమస్యను తీవ్రం చేస్తూ దేశ హాకీ రంగానికి రెండు సమాఖ్యలు తయారయ్యాయి. భారత హాకీ సమాఖ్య, హాకీ ఇండియా ఆధిపత్య పోరు ఈ క్రీడను మరింత దిగజారుస్తున్నది. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌కు మన జట్టు క్వాలిఫై అయనప్పటికీ చిట్టచివరి స్థానంలో నిలిచి అభిమానులను నిరాశ పరచింది. ఇప్పుడు రియోలోవ ఏ విధంగా రాణిస్తుందో చూడాలి.