క్రీడాభూమి

‘శుభారంభమే కీలకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో శుభారంభమే అత్యంత కీలకమని భారత హాకీ జట్టు గోల్‌కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఎనిమిది పర్యాయాలు ఒలింపిక్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న భారత్ చాలా కాలంగా అదే స్థాయిలో రాణించలేకపోతున్నది. పతకం మాట ఎలావున్నా, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడానికే నానా తంటాలు పడుతున్నది. సర్దార్ సింగ్ నాయకత్వంలో రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్న తాము పతకాన్ని సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నామని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీజేష్ చెప్పాడు. ప్రతి మ్యాచ్‌నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఒక్కో అడుగు ముందుకు వేయాలన్నదే తమ వ్యూహమని చెప్పాడు. పరిస్థితులను బట్టి అనుసరించే వ్యూహాలు మారుతాయని అన్నాడు. రియో ఒలింపిక్స్‌లో తమ మొదటి ప్రత్యర్థి ఐర్లాండ్‌ను ఓడించి శుభారంభం చేస్తే, ఆతర్వాత పరిస్థితిని మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. 2014 కామనె్వల్త్ గేమ్స్ తర్వాత ఐర్లాండ్‌తో ఇప్పటి వరకూ భారత్ ఒక్క మ్యాచ్‌ని కూడా ఆడని విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రస్తుతం ఆ జట్టు ఏ విధంగా ఆడుతుందో, ఏ విధంగా దాడులకు ఉపక్రమిస్తుందో తెలియదని చెప్పాడు. అందుకే, ముందుగా వ్యూహాలు సిద్ధం చేసుకొని మ్యాచ్‌లు ఆడడం సాధ్యం కాదని శ్రీజేష్ స్పష్టం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ఆటను ప్రదర్శిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తాము మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు గతంలో చాలా పొరపాట్లు దొర్లేవని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని 29 ఏళ్ల స్టార్ గోల్‌కీపర్ తెలిపాడు. ప్రతి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటూ, ఆటకు మెరుగులు దిద్దుకుంటూ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నామని అన్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 12వ స్థానంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించగా, గతాన్ని తలచుకునే కంటే భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై దృష్టి కేంద్రీకరించడం మంచిదన్నాడు. అప్పటి ఫలితం ఈసారి సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుందని తెలిపాడు.