క్రీడాభూమి

ఒలింపిక్ క్రీడా గ్రామంలో భారత బృందానికి ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 3: రియో డి జెనీరోలో భారత బృందానికి బుధవారం ఘన స్వాగతం లభించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులు రియో క్రీడా గ్రామానికి చేరుకొని, తమకు కేటాయించిన గదుల్లో బస చేస్తున్నారు. అయితే, ఒక్కో దేశ బృందాన్ని ఆహ్వానించడానికి ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) ఒక్కో తేదీని ఖరారు చేసింది. అధికారికంగా బుధవారం భారత్ వంతు వచ్చింది. బృందంలోని కొంత మంది ప్రాక్టీస్‌లో నిమగ్నం కావడంతో ఈ స్వాగత కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న వారిలో షూటర్లు జితూ రాయ్, ప్రకాష్ నంజప్ప, గుర్‌ప్రీత్ సింగ్, చైన్ సింగ్, అథ్లెట్లు కుష్బీర్ కౌర్, మన్‌ప్రీత్ కౌర్, మహిళల హాకీ జట్టు సభ్యులు ఉన్నారు. అదే విధంగా స్విమ్మర్లు సాజన్ ప్రకాష్, శివానీ కతారియా, కొంత మంది కోచ్‌లు, అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బ్రెజిల్ సంప్రదాయ నృత్యాలు, విన్యాసాలు, పాటలతో నిర్వాహకులు భారత్‌కు ఘనంగా స్వాగతం పలికారు. సుమారు 45 నిమిషాలు కొనసాగిన ఈ కార్యక్రమం బ్రెజిల్ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. ఒలింపిక్స్‌లో పోటీపడే క్రీడాకారులు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించారు. రియో క్రీడా గ్రామం అధ్యక్షురాలు, రెండు పర్యాయాలు ఒలింపిక్స్‌లో పాల్గొన్న బాస్కెట్‌బాల్ మాజీ క్రీడాకారిణి జెనెత్ అకైన్ ఈ స్వాగత కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) అధ్యక్షుడు రామచంద్రన్ నారాయణ స్వామి, చెఫ్ డి మిషన్ రాకేష్ గుప్తా ఆమెకు బహుమతులు అంద చేశారు. వాటిలో ఒకి వెండితో చేసిన ఏనుగుల జంటకాగా, మరొకటి బంగారు పూత పూసిన నెమలి బొమ్మ. దాని కింద ఐఒఎ లోగోను ముద్రించారు. బహమాస్, బుర్కినా ఫసో, గాంబియా, నార్వే బృందాలతోపాటు బుధవారం స్వాగతాన్ని అందుకున్న భారత బృందానికి బ్రెజిలియన్ల సంప్రదాయ నృత్యాలు, పాటలతో కళాకారులు స్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరేవేసినప్పుడు భారత బృందంలోని వారంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం బ్రెజిల్ గిరిజనుల సంప్రదాయ నృత్యంతో మొదలైంది. ఫరో, సాంబ, బొస్సా నొవా నృత్యరీతులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ హిట్స్‌తోపాటు బ్రెజిలియన్ లెజెండ్స్ రాల్ సీక్సాస్, టిమ్ మయా సంగీత ఘరి కూడా ఆ ప్రాంతంలో మారుమోగింది. సంగీత, నృత్య కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఒలింపిక్ విలేజ్ మేయర్ జెనెత్ ప్రసంగించింది. ఒలింపిక్స్ ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించింది. క్రీడాస్ఫూర్తి ఆవశ్యకతను గుర్తుచేసింది.
chitram...
రియో ఒలింపిక్ క్రీడా గ్రామంలో సంప్రదాయ నృత్యంతో స్వాగతం పలుకుతున్న ఓ కళాకారుడి విన్యాసాలు తిలకిస్తున్న భారత బృందం (ఎడమ).
మహిళల హాకీ జట్టు సభ్యులతో కలిసి సెల్ఫీ దిగుతున్న కోచ్ మహమ్మద్ కన్హీ