క్రీడాభూమి

లోధా సిఫార్సుల అమలుపై బిసిసిఐ ప్రత్యేక సమావేశం నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేసే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం) శుక్రవారం ఇక్కడ జరిగింది. వచ్చే ఆరు నెలల్లో లోధా సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులను యథాతథంగా అమలు చేయడం అసాధ్యమని బిసిసిఐ చేసిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నాయకులకు, మంత్రులు బోర్డులో కీలక పాత్ర పోషించడానికి వీల్లేదని లోధా కమిటీ స్పష్టం చేసింది. పాలక మండలిలో వరుసగా రెండుసార్లు, మొత్తం మీద మూడు పర్యాయాల కంటే ఎక్కువ కాలం సభ్యుడిగా ఎవరూ ఉండకూడదని తేల్చిచెప్పింది. బోర్డు తరఫున అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, లోధా సిఫార్సులను అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యలను వివరించడానికి సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూను సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన ఏ విధమైన అభ్యంతరాలను లేవనెత్తుతాడో, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో చూడాలి. మొత్తం మీద శుక్రవారం జరిగే ఎస్‌జిఎం బోర్డు భవిష్యత్తును నిర్ణయించనుంది.