క్రీడాభూమి

లిమాను వరించిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమాను అదృష్టం వరించింది. ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించే అవకాశం లభించింది. మూడు పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్న గుస్టావో కుయెర్టన్ ఒలింపిక్ టార్చిని స్టేడియంలోకి తీసుకొచ్చాడు. అతని దగ్గర టార్జిని అందుకున్న 1996 ఒలింపిక్స్ మహిళల బాస్కెట్‌బాల్ రజత పతక విజేత హోర్టెనికా మెర్సారీ దానిని 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ మారథాన్‌లో కాంస్య పతకాన్ని సాధించిన లిమాకి అందించింది. అతను ఒలింపిక్ జ్యోతిని వెలిగించాడు. వాస్తవానికి ఈ క్రీడాజ్యోతి ప్రజ్వలనం బ్రెజిస్ సాకర్ లెజెండ్ పీలే చేయాల్సి ఉంది. కానీ, ఆరోగ్యం సహకరించడం లేదని, అందుకే ప్రారంభోత్సవానికి రావడం లేదని అతను చివరి క్షణాల్లో ప్రకటించాడు. దీనితో క్రీడా జ్యోతిని వెలిగించే అదృష్టం డి లిమాకు దక్కింది.
బాంబు భయం
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సమయంలో అలజడి సృష్టించడానికి కొపకబనా స్టేడియంలో బాంబు పెట్టినట్టు సమాచారం అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాంబ్ డిస్పోసల్ రోబోలతో అణవణువును గాలించారు. మరకానా స్టేడియంలో ప్రారంభోత్సవం జరుగుతుండగా, కొపకబనాలో అధికారులు, భద్రతా సిబ్బంది మాత్రం బాంబు ఎక్కడ ఉందోనని గాలించడంలో నిమగ్నమయ్యారు. స్టేడియం మొత్తాన్ని తనిఖీ చేసిన తర్వాత బాంబు లేదని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం.. క్రీడా జ్యోతిని వెలిగించిన బ్రెజిల్ మాజీ అథ్లెట్ వాండెర్లీ డి లిమా