క్రీడాభూమి

ఓ... రియో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరోలో 31వ ఒలింపిక్స్ ఆరంభం అదిరిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మొదలైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రెజిల్ సంప్రదాయ సంగీత, నృత్య రూపకాలు అలరించాయి. భారత బృందానికి త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ఏస్ షూటర్ అభినవ్ బింద్రా నాయకత్వం వహించాడు. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్ ఒలింపిక్స్‌కు సమర్థంగా ఆతిథ్యమిస్తుందా? అన్న అనుమానాలకు ప్రారంభోత్సవ వేడుక తెరదించింది. గత ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా రియోలో కన్నుల పండువగా సాగిన కార్యక్రమాలు రాబోయే రోజుల్లో క్రీడా ఈవెంట్స్ ఏవిధంగా జరుగుతాయో చెప్పకనే చెప్పాయి. 209 దేశాల నుంచి పదకొండు వేలకుపైగా అథ్లెట్లు పోటీపడుతున్న రియో ఒలింపిక్స్ విజయవంతం చేయడానికి నిర్వహణ కమిటీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు చేపడుతున్న ప్రదర్శనలతో రియో అట్టుడుకుతోంది. ఏథెన్స్ ఒలింపిక్స్ మాదిరిగానే రియో గేమ్స్ కూడా దారుణంగా విఫలమవుతాయా? లేక అడ్డంకులను అధిగమించి బ్రెజిల్ సత్తా చాటుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.