క్రీడాభూమి

ఆకట్టుకున్న యస్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు మొట్టమొదటిసారి బరిలోకి దిగితే, సిరియా శరణార్థి యస్రా మర్డీనీ మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లై హీట్స్‌ను సమర్థంగా పూర్తి చేసి అందరినీ ఆకట్టుకుంది. సుమారు ఏడాది క్రితం ప్రాణం కోసం సిరియాను విడిచిపెట్టిన ఆమె స్విమ్మింగ్‌పై దృష్టి కేంద్రీకరించింది. రియో ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) పతాకం కింద పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. హీట్స్‌ను పూర్తి చేసిన ఆమె సెమీ ఫైనల్స్ చేరడంలో విఫలమైంది. అయితే, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని హీట్స్‌ను పూర్తి చేసిన ఆమెకు ప్రేక్షకులు జేజేలు పలికారు.