క్రీడాభూమి

బ్రిటీష్ స్విమ్మర్ పీటి ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 7: రియో ఒలింపిక్స్‌లో మొదటి ప్రపంచ రికార్డు నమోదైంది. బ్రిటీష్ స్విమ్మర్ ఆడం పీటి పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్స్‌ను 57.55 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అతను స్వర్ణ పతకాన్ని సాధించే అవకాశాలను మెరుగుపరచుకున్నాడు. హీట్స్ పూర్తి చేసుకొన్న అతను సెమీ ఫైనల్స్‌లో లక్ష్యాన్ని 57.62 సెకన్లలో చేరాడు. ఫైనల్స్ చేరిన అందరిలోకీ అతనే వేగంగా గమ్యాన్ని చేరిన వాడుకాబట్టి, స్వర్ణ పతకం రేసులో ముందున్నాడు.
యాంగ్‌కు షాక్
పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో చైనా స్విమ్మర్, డిఫెండింగ్ చాంపియన్ సన్ యాంగ్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాక్ హోర్టన్ 3 నిమిషాల 41.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణ పతకం సాధించగా, యాంగ్ 3 నిమిషాల 41.68 సెకన్ల కాలంతో రజత పతకానికి పరిమితయ్యాడు. ఇటలీ స్విమ్మర్ గాబ్రియెల్ డెట్టీ 3 నిమిషాల 43.49 సెకన్లలో గమ్యాన్ని పూర్తి చేసి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
వియత్నాం, థాయిలాండ్ బోణీ
ఒలింపిక్స్‌లో వియత్నాం థాయిలాండ్ దేశాలు స్వర్ణ పతకాల సాధనలో బోణీ చేశాయి. ఇప్పటి వరకూ ఒక్క స్వర్ణాన్ని కూడా సాధించలేకపోయిన ఈ దేశాలకు రియోలో తొలిసారి పతకాలు లభించాయి. మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో సోపిటా తనాసన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. థాయిలాండ్ క్రీడా చరిత్రలో ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణం. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో వియత్నాం షూటర్ హొయాంగ్ జువాన్ విన్ కూడా విజేతగా నిలిచాడు. ఆ దేశానికి కూడా ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.
సైక్లింగ్‌లో ఎవర్మెట్‌కు స్వర్ణం
హేమాహేమీలు పోటీపడిన పురుషుల సైక్లింగ్ రోడ్ రేస్‌లో బెల్జియం సైక్లిస్టు గ్రెగ్ వాన్ ఎవర్మెట్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ప్రతిష్ఠాత్మక టూర్ డి ఫ్రాన్స్‌ను గెల్చుకున్న క్రిస్ ఫ్రూమ్ ఒలింపిక్స్‌లోనూ విజేతగా నిలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగాడు. అనుకున్నట్టుగానే స్వర్ణం సాధిస్తే, టూర్ డి ఫ్రాన్స్, ఒలింపిక్స్‌లో టైటిళ్లు సాధించిన తొలి సైక్లిస్టుగా రికార్డు సృష్టించి ఉండేవాడు. కానీ, అతని ప్రయత్నం విఫలంకాగా, ఎవర్మెట్‌కు స్వర్ణం లభించింది. జాకబ్ ఫుగ్లాసనా, రాఫెల్ మజ్కా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను సంపాదించారు.

మొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటూ పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ హీట్స్‌లోనే సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడమేగాక, సెమీస్ చేరడం ద్వారా టైటిల్ అవకాశాలను మెరుగుపరచుకున్న బ్రిటీష్ స్విమ్మర్ ఆడం పీటి