క్రీడాభూమి

15 సంస్కరణలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: వచ్చే అక్టోబర్ 15 లోగా 15 సంస్కరణలను అమలు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ స్పష్టంగా ఆదేశించింది. రాజ్యాంగ సంస్కరణలు మొదలుకొని, వందలాది కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే టీవీ కాంట్రాక్ట్‌లు సహా వివిధ కాంట్రాక్ట్ ఇవ్వడానికి సంబందించిన సంస్కరణలు వీటిలో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే మంగళవారం లోధా కమిటీ సభ్యులను కలిశారు. అంతేకాదు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తాను రాలేక పోతున్నానని పేర్కొంటూ బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ రాసిన ఒక లీవ్ లెటర్‌ను ఆయన తనతో తీసుకెళ్లారు. అక్టోబర్ 15 నాటికల్లా రాజ్యాంగ సవరణలకు సంబంధించి 15 నిర్దిష్ట చర్యలు అమలు చేయాలని లోదా కమిటీ బిసిసిఐకి నిర్దిష్ట కాలపరిమితి ఇచ్చింది. అయితే సంస్కరణల అమలుకు సంబంధించి తొలి నివేదికను ఈ నెల 25 నాటికి అందజేయనున్నట్లు షిర్కే కమిటీకి తెలియజేశారని లోధా కమిటీ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. తీసుకోవలిసన చర్యల గురించి అడగ్గా, అవి ప్రధానంగా మెమోరాండం ఆఫ్ అసోసియేషన్లకు సంబంధించినవని ఆ వర్గాలు తెలిపాయి. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్, రాష్ట్ర క్రికెట్ సంఘాల రాజ్యాంగానికి సంబందించిన డాక్యుమెంట్లు, కాంట్రాక్ట్‌లు ఇవ్వడానికి సంబంధించిన సూత్రాలను అది ప్రస్తావించిందని ఆ వర్గాలు తెలిపాయి.
సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రస్తావించిన కొన్ని అంశాలు ముఖ్యంగా ఒక రాష్ట్రం ఒక ఓటు, 70 ఏళ్ల వయోపరిమితి, తొమ్మిదేళ్ల పదవీ కాలం వంటి నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి షిర్కే కమిటీ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు అయినందున తామేమీ చేయలేమని లోధా కమిటీ సభ్యులు తెలపగా.. త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశంలో షిర్కే చెప్పినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత టీవీ హక్కులు ఇవ్వడం లాంటి విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని లోధా కమిటీ బిసిసిఐకి చెప్పినట్లు కూడా తెలుస్తోంది.