క్రీడాభూమి

సైనా, సింధు శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు, హైదరాబాదీలు సైనా నెహ్వాల్, పివి సింధు శుభారంభం చేశారు. స్థానిక క్రీడాకారిణి లొహానీ విసెనే్టతో తలపడిన సైనా 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో గెలిచింది. టైటిల్ రేసులో ఉన్నదంటూ పోటీలు ఆరంభానికి ముందే ముద్ర పడిన సైనా తనపై అభిమానులు ఉంచుకున్న ఆశలను వమ్ము చేయకుండా తొలి రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి ముందంజ వేసింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో హంగరీకి చెందిన లారా సరోసీని ఢీకొన్న సింధు 21-8, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. సైనాతోపాటు సింధు కూడా టైటిల్ రేసులో ఉండడం విశేషం.
భారత్ పోటీపడుతున్న ఒక్కో ఈవెంట్‌లో వరుసగా నిరాశాజనక ఫలితాలు వెలువడుతుండగా, బాడ్మింటన్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. పతకాలు సాధించే సత్తాగల స్టార్లు బాడ్మింటన్ జట్టులో ఉండడంతో, ఈ పోటీల్లోనే భారత్ పతకాల ఖాతా తెరిచే అవకాశం ఉంది.
జ్వాల, అశ్వినీ జోడీ ఓటమి
బాడ్మింటన్‌లో శుభారంభం చేస్తుందనుకున్న గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప జోడీ మొదటి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. జపాన్‌కు చెందిన అయాకా తకహషి, మిసాకీ మత్సుమొటో జోడీతో తలపడిన జ్వాల, అశ్వినీ 15-21, 10-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. మొదటి సెట్‌లో విజయం కోసం తీవ్రంగానే పోరాడిన వీరు ఆ సెట్ చేజారిన వెంటనే నీరసపడిపోయారు. ఫలితంగా రెండో సెట్‌లో ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే ఓటమిని అంగీకరించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగిన వీరు తర్వాతి మ్యాచ్‌లో ఇఫీ మస్కెన్స్, సెలెనా పీక్ జోడీని ఢీ కొంటారు.
అదే దారిలో అత్రి, సుమీత్
మహిళల డబుల్స్‌లో జ్వాలా, అశ్వినీ మాదిరిగానే పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ మొదటి మ్యాచ్‌లో పరాజయాన్ని చవిచూసింది. ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ అసన్, హెండ్రా సెతియవాన్ జోడీ చేతిలో 18-21, 13-21 తేడాతో అత్రి, సుమీత్ ఓటమిపాలయ్యారు. మొదటి సెట్‌లో కొంత వరకు మెరుగ్గా రాణించిన వీరు రెండో సెట్‌లో మరింత పేలవమైన ఆటతో అభిమానులను నిరాశ పరిచారు.

చిత్రం.. తొలి మ్యాచ్‌లో గెలిచిన సైనా, బాడ్మింటన్‌లో ముందంజ వేసిన పివి సింధు