క్రీడాభూమి

పతకం వేటలో వికాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: భారత బాక్సర్ వికాస్ క్రిష్ణన్ రియోలో పతకం సాధించే దిశగా ముందంజ వేశాడు. 75 కిలోల మిడిల్‌వెయిట్ విభాగంలో పోటీపడిన అతను టర్కీకి చెందిన సిపల్ ఆండర్‌ను 3-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. సెమీస్‌లో చేరేందుకు అతను ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెటెమిర్ మిలికజీవ్‌ను ఢీ కొంటాడు. ఒకవేళ సెమీ ఫైనల్‌లోకి అడుగుపెడితే, ఆతర్వాత ఫలితాలతో సంబంధం లేకుండా అతనికి పతకం లభిస్తుంది.
అథ్లెట్ల వైఫల్యాలు
గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల వైఫల్యాలు మొదలయ్యాయి. 36 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌కు ఎంపికైన తొలి భారతీయురాలు దుతీ చంద్ 11.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, ఏడో స్థానానికి పరిమితమైంది. 11.24 సెకన్ల తన జాతీయ రికార్డు స్థాయిలో కూడా దుతీ రాణించలేకపోవడం గమనార్హం. పురుష హార్మోన్లు అధికంగా ఉన్నాయన్న కారణంగా సస్పెన్షన్‌కు గురై, ఆతర్వాత కోర్టు ద్వారా క్లీన్‌చిట్ పొందిన దుతీ తన స్థాయికి తగిన ప్రతిభను ప్రదర్శించలేక అభిమానులను నిరాశ పరచింది.
లాంగ్ జంప్‌లో అంకిత్ శర్మ ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించలేకపోయాడు. అతను అత్యుత్తమంగా 7.67 మీటర్ల దూరానికి లంఘించాడు. అయితే, ఒలింపిక్స్ స్థాయికి అది చాలా తక్కువ. అతనికి ఆరో స్థానం దక్కింది. పురుషుల 500 మీటర్ల పరుగులో మహమ్మద్ అనాస్ కూడా హీట్స్‌లోనే నిష్క్రమించాడు. 50 మంది పోటీపడిన ఈ రేసులో అతనికి 31వ స్థానం లభించింది. పురుషుల డిస్కస్ త్రోలో వికాస్ గౌత ఫ్లాప్ షోతో డీలాపడిన విషయం తెలిసిందే. మహిళల షాట్‌పుటర్ మన్‌ప్రీత్ కౌర్, పురుషుల 800 మీటర్ల పరుగులో జిన్సన్ జాన్సన్ కూడా ఫైనల్స్‌కు చేరుకోకుండానే ఇంటిదారి పట్టారు. 20 కిలోమీటర్ల నడకలో మనీష్ సింగ్ రావత్ 13వ స్థానంతో సంతృప్తి చెందాడు. ఇదే ఈవెంట్‌లో పోటీపడిన గుర్మీత్ సింగ్, కృష్ణన్ గణపతి డిస్‌క్వాలిఫై అయ్యారు.
షెరాన్‌కు 44వ స్థానం
మహిళల 400 మీటర్ల పరుగును భారత అథ్లెట్ నిర్మలా షెరాన్ 44వ స్థానంతో ముగించింది. హీట్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఫిలిస్ ఫ్రాన్సిస్ 50.58 సెకన్లలో గమ్యాన్ని చేరితో, బహ్రైన్‌కు చెందిన ఒలుకెమీ అడెకొయా 50.72 సెకన్లు, సల్వా ఎద్ నాసెర్ 51.05 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి, వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. వీరితో పోలిస్తే షెరాన్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఆమె 53.03 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది.
పతకమే నా లక్ష్యం: నర్సింగ్
ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని, అంతకు మించి ఇతర విషయాలను తాను పట్టించుకోనని భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ స్పష్టం చేశాడు. లండన్ ఒలింపిక్స్ పతక విజేత సుశీల్ కుమార్‌ను పక్కకునెట్టి రియో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్న నర్సింగ్ డోపింగ్ పరీక్షలో విఫలం కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనను ఒలింపిక్స్‌కు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎవరో ఉద్దేశపూర్వకంగా తనకు నీటిలో మాదక ద్రవ్యాన్ని కలిపి ఇచ్చారని నర్సింగ్ ఆరోపించడమేగాక, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. తన స్థానంలో ప్రవీణ్ రాణాను ఎంపిక చేయడాన్ని కోర్టులో సవాలు చేశాడు. తీర్పు తనకు అనుకూలంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఎన్నో నాటకీయ పరిణామాల అనంతరం రియోలోని ఒలింపిక్స్ క్రీడా గ్రామానికి చేరుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నాడు. ఎంపిక నుంచి డోపింగ్ వరకు వివిధ పరిణామాల గురించి విలేఖరులు ప్రస్తావించగా, గతాన్ని గురించి ఆలోచించనని చెప్పాడు. ఆ అంశాలపై మాట్లాడాలన్న ఆసక్తి తనకు లేదన్నాడు. తన దృష్టి మొత్తం జరగబోయే పోటీలపైనే కేంద్రీకృతమైందన్నాడు. ఈ సమయంలో గతాన్ని గురించి ఆలోచించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించాడు.