క్రీడాభూమి

తిరుగులేని లెడెకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 13: అమెరికా స్విమ్మర్ కాటీ లెడెకీ రియో ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆమె లక్ష్యాన్ని 8 నిమిషాల 4.79 సెకన్లలో చేరి, గతంలో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును తానే అధిగమించింది. రియోలో ఆమెకు ఇది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 4న200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో ఆమె స్వర్ణ పతకాలను సాధించింది. 4న100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో రజత పతకాన్ని గెల్చుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో విజేతగా నిలిచిన ఆమె టైటిల్‌ను నిలబెట్టుకోవడమేగాక, కొత్త ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం. జాజ్ కార్లిన్ (బ్రిటన్/ 8 నిమిషాల 16.17 సెకన్లు) రజత పతకాన్ని సాధించగా, హంగరీ స్విమ్మర్ బొగ్లార్కా కపాస్ 8 నిమిషాల 16.37 సెకన్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.