క్రీడాభూమి

ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సింగపూర్ యువ స్విమ్మర్ జోసెఫ్ స్కూలింగ్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 22 స్వర్ణాలతో తిరుగులేని వీరుడిగా ఎదిగిన మైఖేల్ ఫెల్ప్స్‌ను రెండో స్థానానికి నెట్టి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అతను సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించడం విశేషం. స్విమ్మంగ్‌లో పెల్ప్స్ వారసుడు వచ్చాడని క్రీడా పండితులు అంటున్నారు.

రియో డి జెనీరో, ఆగస్టు 13: రియో ఒలింపిక్స్ అక్వా స్టేడియంలో సంచలనాల ప్రకంపనలు రేగాయి. తాజా ఒలింపిక్స్‌లో నాలుగు, మొత్తం మీద 22 స్వర్ణ పతకాలతో ఊపుమీద ఉన్న అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ను సింగపూర్ యువకుడు జోసెఫ్ స్కూలింగ్ ఓడించి సంచలనం సృష్టించాడు. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్వర్ణ పతకం ఖాయం అనుకున్న ఫెల్ప్స్ రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. 21 ఏళ్ల స్కూలింగ్ 50.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, కొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించాడు. ఫెల్ప్స్‌తోపాటు మరో ఇద్దరు స్విమ్మర్లు కూడా రేస్‌ను 51.14 సెకన్లలో పూర్తి చేయడం గమనార్హం. పురుషుల విభాగంలో రజత పతకానికి ఈ విధంగా ముగ్గురి మధ్య పోటీ నెలకొనడం ఇదే మొదటిసారి. ఒలింపిక్స్ చరిత్రను పరిశీలిస్తే, 1968లో మహిళల 500 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో ఈ విధంగా త్రిముఖ పోటీ నెలకొంది. కాగా, ఫెల్ప్స్, చాడ్ లె క్లాస్‌లను సంయుక్త రజత పతక విజేతలుగా నిర్వాహకులు ప్రకటించారు. సెకనులో వందో వంతును పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అదే సమయంలో గమ్యాన్ని చేరిన హంగరీ స్విమ్మర్ లస్‌జ్లో సెచ్ కాంస్య పతకాన్ని స్వీకరించాడు.
‘డబుల్’ దిశగా నాదల్
ప్రపంచ మాజీ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ రియో ఒలింపిక్స్‌లో డబుల్ టైటిళ్లను సాధించే దిశగా దూసుకెళుతున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో తన చిరకాల మిత్రుడు మార్క్ లొపెజ్‌తో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో రుమేనియాకు చెందిన ఫ్లోరియన్ మెర్గియా, హోరియా టకావూ జోడీని 6-2, 3-6, 6-4 తేడాతో ఓడించాడు. ఒలింపిక్స్‌లో అతనికి ఇది రెండో స్వర్ణం. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో నాదల్ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. కాగా, రియోలో సింగిల్స్‌లోనూ రాణిస్తున్నాడు. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో నాదల్ 2-6, 6-4, 6-2 తేడాతో బ్రెజిల్ ఆటగాడు తొమాజ్ బెలూసీని ఓడించి టైటి ల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. అందులో నూ విజేతగా నిలవడం ద్వారా రియోలో ‘డబుల్’ ను సాధించడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు.
కెర్బర్, మోనిక టైటిల్ పోరు
మహిళల సింగిల్స్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్, పోర్టారికోకు చెందిన మోనిక పగ్ టైటిల్ కోసం పోరాడనున్నారు. సెమీ ఫైనల్‌లో కెర్బర్ 6-3, 7-5 తేడాతో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. మోనిక 6-4, 1-6, 6-3 స్కోరుతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది.