క్రీడాభూమి

సైనా నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 14: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రియో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం నాటి గ్రూప్ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 61వ ర్యాంక్ క్రీడాకారిణి మరిజా ఉలిటినాను ఢీకొన్న సైనా 18-31, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో హైదరాబాదీ సైనా టైటిల్ రేసులో అందరి కంటే ముందు ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ, ఆమె పేలవమైన ఆటతో ఇంటిదారి పట్టింది. నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న సైనా ఈసారి కనీసం క్వార్టర్స్‌లోకి కూడా అడుగుపెట్టలేకపోవడం అందరినీ నిరాశపరచింది.
షూటర్లు ఫ్లాప్
భారత షూటర్ల ఫ్లాప్ షో ఆదివారం కూడా కొనసాగింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో పోటీపడిన చైన్ సింగ్, గగన్ నారంగ్ క్వాలిఫయింగ్ రౌండ్స్ నుంచే వెనుదిరిగారు. నారంగ్ ఆరంభం నుంచే పేలవమైన ప్రదర్శనతో నీరసపడడంతో అతను పోటీ నుంచి నిష్క్రమించడం ఖాయంగా కనిపించింది. చైన్ సింగ్ మాత్రం చివరి మూడో స్టేజ్ చివరి వరకూ టాప్-10లో కొనసాగి, ఫైనల్స్‌పై ఆశలు కల్పించాడు. కానీ, చివరిదైన నాలుగో స్టేజ్‌లో విఫలమైన అతను మొత్తం 1,169 పాయింట్లతో క్వాలిఫయింగ్ రౌండ్ నుంచే వెనుదిరిగాడు. నారంగ్ 1,074 పాయింట్లు సంపాదించగలిగాడు.
సానియా, బొపన్న విఫలం
కాంస్య పతకం కోసం ఆదివారం జరిగిన ప్లే ఆఫ్‌లో రాడెక్ స్ట్ఫోనెక్, లూసీ హడెకా జోడీని ఢీకొన్న సానియా మీర్జా, రోహన్ బొపన్న వరుస సెట్లలో ఓడారు. మొదటి సెట్‌ను 1-6 తేడాతో చేజార్చుకున్న వీరు రెండో సెట్‌లో కొంత సేపు ఫ్రతిఘటించినా ఫలితం లేకపోయంది. రెండో సెట్‌లో కొంత సేపు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయంది. ఆ సెట్‌ను 5-7 తేడాతో కోల్పోయన సానియా, బొపన్న నాలుగో స్థానానికి పడిపోయారు.