క్రీడాభూమి

హాకీ క్వార్టర్స్‌లో పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 14: భారత పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌లో పరాజయాన్ని ఎదుర్కొంది. 36 సంవత్సరాల విరామం తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీ ఫైనల్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంతో తలపడిన భారత్‌కు ఆకాశ్‌దీప్ సింగ్ ఆరంభంలోనే గోల్‌ను సాధించిపెట్టాడు. అయతే, ఆ ఆధిక్యాన్ని శ్రీజేష్ నాయకత్వంలోని భారత జట్టు నిలబెట్టుకోలేకపోయంది. సెబాస్టియన్ డొకర్ ఈక్వెలైజర్‌ను నమోదు చేసి, మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ రేపాడు. భారత ఆటగాళ్లు ఎదురు దాడికి దిగే లోపే అతను మరోసారి అద్భుత ప్రదర్శనతో రాణించాడు. తన జట్టుకు రెండో గోల్‌ను అందించాడు. బెల్జియం రక్షణ వలయాన్ని ఛేదించి, ఈక్వెలైజర్‌ను నమోదు చేయడం ద్వారా, మ్యాచ్‌పై పట్టు బిగించాలన్న భారత్ ప్రయత్నాలు ఫలించలేదు. కోట గోడ మాదిరి మారిన బెల్జియం డిఫెన్స్‌ను దాటుకొని దాడులు చేయడంలో విఫలమైంది. కాగా, చివరిలో టామ్ బూన్ చేసిన గోల్‌తో బెల్జియం 3-1 తేడాతో గెలిచి, సెమీస్ చేరింది.

మహిళల స్ప్రింట్
విజేత ఎలేన్
రియో డి జెనీరో, ఆగస్టు 14: మహిళల 100 మీటర్ల స్ప్రింట్‌ను జమైకా అథ్లెట్ ఎలేన్ థాంప్సన్ 10.71 సెకెన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అమెరికాకు చెందిన టోరీ బొవీ, డిఫెండింగ్ చాంపియన్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ పెర్సీ నుంచి ఎదురైన పోటీని సమర్థంగా ఎదుర్కొన్న 24 ఏళ్ల ఎలేన్ విజేతగా నిలిచింది. బొవీ 10.83 సెకన్లతో రజత పతకాన్ని గెల్చుకోగా, టైటిల్ నిలబెట్టుకోలేకపోయిన షెల్లీ 10.86 సెకన్లతో కాంస్య పతకంతో సంతృప్తి చెందింది.