క్రీడాభూమి

తిరుగులేని రుదిషా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనిరో, ఆగస్టు 16: కెన్యాకు చెందిన డేవిడ్ రుదిషా 800 మీటర్ల పరుగుపందెంలో సునాయాసంగా విజయం సాధించడం ద్వారా ఈ వినాగంలో తనకు ఎదురు లేదని చాటాడు. అంతేకాదు, 1964లో న్యూజిలాండ్‌కు చెందిన పీటర్ స్నెల్ తర్వాత ఈ విభాగంలో వరసగా రెండు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. ‘ఇంత పెద్ద పోటీలో గెలవడం గొప్పగా ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. ఇది నా కెరీర్‌లోనే మరువలేని అతి పెద్ద సంఘటన’ అని రుదిషా అన్నాడు. అయితే ఇది జరిగిన కొద్ది సేపటికే బహమాస్‌కు చెందిన మిల్లర్ అతడ్ని మరిచిపోయేలా చేసింది. మహిళల 400 మీటర్ల రేస్ ఫైనల్లో పరుగెత్తిన మిల్లర్ లక్ష్యాన్ని చేరుకునే సమయంలో ఏకంగా బోర్లా పడిపోయి మరీ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. అమెరికాకు చెందిన అలిసన్ ఫెలిక్స్ ఈ విభాగంలో మొదటినుంచీ ఫేవరేట్‌గా ఉన్నప్పటికీ మిల్లర్ ఆమెను రెండోస్థానానికే పరిమితం చేయడం గమనార్హం. ఇలా తాను ఎన్నడూ చేయలేదని, పడిపోవడం వల్ల అక్కడక్కడా గీచుకుపోవడం, చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయని 22 ఏళ్ల మిల్లర్ చెప్పింది. స్వర్ణ పతకం సాధించాలన్నదొక్కటే తన మనసులో మెదలాడుతూ ఉండిందని ఆమె చెప్పింది.

చిత్రం..800 మీటర్ల పరుగు పోటీలో వరుసగా రెండోసారి స్వర్ణాన్ని సాధించిన డేవిడ్ రుదిషా