క్రీడాభూమి

లోధా సిఫార్సులపై చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలు, ఆతర్వాత కోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌లపై చర్చించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలక మండలి సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా లోధా కమిటీ ప్రతిపాదనలపైనే చర్చ సాగుతుందని సమాచారం. ఆరు నెలల్లోగా సంస్కరణలు అమలు జరిగి తీరాలని లోధా ప్యానెల్ ఇప్పటికే స్పష్టం చేయగా, అందులో ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ సుప్రీం కోర్టులో బోర్డు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తీర్పు బోర్డుకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జరగబోయే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.