క్రీడాభూమి

మాజీ క్రికెటర్‌కు ఒలింపిక్స్ పతకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 21: ఒక క్రీడలో పేరుప్రఖ్యాతులు ఆర్జించిన వారు మరో క్రీడలోనూ రాణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, కొత్తగా చేపట్టిన క్రీడలో ఏకంగా ఒలింపిక్ పతకాన్ని సాధించిన సంఘటనలు దాదాపుగా లేవు. ఎవరూ ఊహించిన ఈ ఫీట్‌ను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ సనెట్ విల్జియాన్ సాధించింది. రియో ఒలింపిక్స్ మహిళల జావెలిన్ త్రోలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. క్రొయేషియాకు చెందిన సారా కొలాక్ 66.18 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి స్వర్ణ పతకాన్ని అందుకోగా, సనెట్ 64.92 మీటర్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. బార్బొరా స్పొటాకొవా (చెక్ రిపబ్లిక్) 64.80 మీటర్ల దూరంతో పోటీని పూర్తి చేసి కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. రజత పతకాన్ని గెల్చుకున్న సనెట్ జావెలిన్ త్రోను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకోక ముందు క్రికెటర్‌గా రాణించింది. 2002 మార్చి 16 నుంచి 22 వరకు భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాల్గొని, 88 పరుగులు చేసింది. కెరీర్‌లో ఆమెకు అదొక్కటే టెస్టు మ్యాచ్. మరో 17 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన ఆమె 198 పరుగులు చేసింది. 54 (నాటౌట్) వనే్డల్లో ఆమె అత్యధిక స్కోరు. అంతగాక, ఈ ఫార్మెట్‌లో 228 బంతులు బౌల్ చేసి, 115 పరుగులిచ్చి ఐదు వికెట్లు కూల్చింది. వనే్డల్లో ఆమె చివరి మ్యాచ్‌ని భారత్‌తోనే ఆడడం విశేషం.