క్రీడాభూమి

భారత్‌లో ఒలింపిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 23: భారతదేశంలో ఒలింపిక్స్ జరగాలని ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించేందుకు కేంద్రంలో బిడ్స్ వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇండియాలో ఒలింపిక్స్ జరగటం ద్వారా క్రీడాకారులు స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఇతర దేశాల కంటే బాగా ఆడేవారు మన దగ్గర చాలా మంది వున్నారని చెప్పారు. రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన పివి సింధును మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహణకు కావాల్సిన విధంగా వౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన తెలుగు అమ్మాయి సింధుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అన్ని విధాలా సహాయసహకారాలు అందించి ప్రోత్సహిస్తామని చెప్పారు. సింధు తల్లిదండ్రులు పివి రమణ, విజయలక్ష్మి కూడా వాలీబాల్ క్రీడాకారులేనని గుర్తుచేశారు. వారు ప్రోత్సహించడం వల్లే ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సింధుకు సాధ్యమైందని అన్నారు. క్రీడాకారుల భవిష్యత్తుకు భద్రత వుంటేనే బాగా ఆడతారని, వారు బాగా రాణిస్తే దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మట్టిలో మాణిక్యాలు చాలామంది వున్నారని, వారిని వెలికితీసే పనిలో తాను వున్నానని చంద్రబాబు అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తన హయాంలోనే హైదరాబాద్‌లో నేషనల్ గేమ్స్‌తో పాటు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ గేమ్స్ జరిగాయన్నారు. తద్వారా ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపినట్టు చెప్పారు. ఒలింపిక్స్ అమెరికా, చైనా క్రీడాకారులకే పరిమితం కాదని, మనవాళ్లు వారికన్నా ఎందులోనూ తీసిపోరని అన్నారు. ప్రోత్సహిస్తే పతకాలు మనవేనని చంద్రబాబు అన్నారు. క్రీడలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుదామని చెప్పారు. అమరావతి స్పోర్ట్స్ విలేజిలో 15 ఎకరాల విస్తీర్ణంలో బాడ్మింటన్ అకాడమీని అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దనున్నట్టు ప్రకటించారు. సింధుకు నగదు ప్రోత్సాహాంగా మూడు కోట్ల రూపాయల చెక్కును ఆయన బహూకరించారు. ఆమెకు వెయ్యి గజాల స్థలాన్ని, గ్రూప్-1 ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌కు 50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించి, చెక్కు అందచేశారు.
ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించిన రజనీకి, యువ బాడ్మింటన్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు చెరి 25 లక్షల రూపాయల నగదు పారితోషికంతో పాటు గ్రూప్-2 ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపటానికి తాను ప్రొటోకాల్‌ను సైతం పక్కనపెట్టి సింధుకు ఎదురెళ్లి ఆహ్వానం పలికానని చెప్పారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్‌లో పతకం సాధించినప్పడు సన్మాన కార్యక్రమానికి గోపీచంద్ ఒక చిన్న పిల్లాడిలా వచ్చి కూర్చున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడే స్ఫూర్తిని పొందిన అతను ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను సాధించాడని అన్నారు.
ఘన స్వాగతం
ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సింధు, ఆమె తల్లిదండ్రులు రమణ, విజయలక్ష్మి, కోచ్ గోపీచంద్‌లకు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సింధును పూలతో అలంకరించిన ప్రత్యేక రథంపై భారీ ర్యాలీతో తీసుకువచ్చారు.
chitram...
విజయవాడలో మంగళవారం జరిగిన విజయోత్సవ సభలో సరదాగా బాడ్మింటన్ అడుతున్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాడ్మింటన్ స్టార్ పివి సింధు