క్రీడాభూమి

బోల్ట్ బూట్లకు రూ. 12 లక్షలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమైకా, ఆగస్టు 23: స్ప్రింట్ యోధుడు, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని ‘ట్రిపుల్’ హ్యాట్రిక్ సాధించిన బోల్ట్ వేసుకున్న బూట్లు వేలానికి వస్తే ఊరుకుంటారా? 2015 బీజింగ్ ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించినప్పుడు బోల్ట్ వేసుకున్న బూట్లను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచినప్పుడు విపరీమైన స్పందన వచ్చింది. ఓ అభిమాని వాటిని 12 లక్షల రూపాయలకు కొన్నాడు. బోల్ట్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది.