క్రీడాభూమి

రెండో వనే్డలో లంక విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 24: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెం డో వనే్డ ఇంటర్నేషనల్‌లో శ్రీలంక జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 48.5 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ మేండిస్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ ఏంజెలో మా థ్యూస్ (57), కుశాల్ పెరెరా (54) అర్ధ శతకాలను సాధించా రు. దినేష్ చండీమల్ 48 పరుగులతో లంక మెరుగైన స్కోరు చేయడానికి తన వంతు సహకారాన్ని అందించాడు. ఆసీస్ బౌ లర్లలో మిచెల్ స్టార్క్ 53 పరుగులకు మూడు, జేమ్స్ ఫాల్క్ నెర్ 45 పరుగులకు మూడు, ఆడం జంపా 42 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఫాల్క్‌నెర్‌కు ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ లభించడం విశేషం. కాగా, ఐదు మ్యాచ్‌లో ఈ సి రీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్‌ని గెల్చుకున్న ఆస్ట్రేలియా 287 ప రుగులు సాధించి రెండో విజయాన్ని నమోదు చేయడంలో వి ఫలమైంది. బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ పోరాడకపోవడంతో ఆ జట్టు 47.2 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటైంది. అమిల అపొ న్సో 18 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చి ఆస్ట్రేలియా బ్యాటిం గ్ లైనప్‌ను దారుణంగా దెబ్బతీశాడు. తిసర పెరెరా 33 పరు గులకు మూడు వికెట్లు కూల్చాడు. వీరి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయన ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ క ట్టారు. మాథ్యూ వేడ్ ఒక్కడే ఒంటరి పోరాటం సాగించి 76 ప రుగులు సాధించగా, మిగతా వారిలో ఆరోన్ ఫించ్ 30, జార్జి బెయలీ 27, ట్రావిస్ హెడ్ 31 చొప్పున పరుగులు చేశారు. కా గా, ఆసీస్‌పై సులభంగానే గెలిచిన లంక ఈ సిరీస్‌ను 1-1గా సమం చేసుకుంది. ఇంకా మూడు మ్యాచ్‌లు జరగాల్సి ఉండ డంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.