క్రీడాభూమి

గుడ్డిలో మెల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్ నిర్వాహణ వల్ల వందల సంఖ్యలో నష్టాలుంటే, పదుల సంఖ్యలో లాభాలు లేకపోలేదు. గుడ్డిలో మెల్ల అన్న చందంగా ప్రభుత్వ రవాణా మెరుగుపడింది. బ్రెజిల్‌లో, ముఖ్యంగా రియో వంటి నగరాల్లో రవాణా సౌకర్యాలు సక్రమంగా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఒలింపిక్స్ కోసం చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లు వేశారు. పాత రోడ్లకు మరమ్మతులు చేశారు. కొత్తకొత్త మార్గాల్లో రైల్వే ట్రాక్స్ కూడా వచ్చాయి. వచ్చే ఏడాదికి రియోలో 67 శాతం మంది ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు. 2009లో కేవలం 17 శాతం మందికే ఇది అందుబాటులో ఉండేది. రవాణా వ్యవస్థ మెరుగుదల ఒక లాభమైతే, ఒలింపిక్స్ కోసం సిద్ధం చేసిన వివిధ వేదికలను భవిష్యత్తులో వివిధ క్రీడా పోటీలకు ఉపయోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరో లాభం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు, ప్రాక్టీస్ సెంటర్లు క్రీడాకారులకు ఉపయోగపడతాయి. అదే విధంగా క్రీడా గ్రామాన్ని వాణిజ్య ప్రాంగణంగా అభివృద్ధి చేస్తే, రియో ఆర్థిక లోటు నుంచి త్వరగానే కోలుకుంటుంది. ఒలింపిక్ కేంద్రాలను తిలకించేందుకు వచ్చే దేశదేశాల క్రీడాభిమానులతో పర్యాటక రంగం కూడా అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉంటుంది. ఒలింపిక్స్ వల్ల బ్రెజిల్‌కు, ముఖ్యంగా రియోకు దక్కనున్న పరిమిత లాభాలు ఇవి.