క్రీడాభూమి

అవార్డు గ్రహీతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీవ్ ఖేల్ రత్న: సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్).
ద్రోణాచార్య: కోచ్‌లు బిశే్వస్వర్ నంది (జిమ్నాస్టిక్స్), రాజ్ కుమార్ శర్మ (క్రికెట్), నాగపురి రమేష్ (అథ్లెటిక్స్), సాగర్ మల్ ధయాల్ (బాక్సింగ్), ప్రదీప్ కుమార్ (స్విమ్మింగ్/ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్), మహాబిర్ సింగ్ (రెజ్లింగ్/ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్).
అర్జున: 1. రజత్ చౌహాన్ (ఆర్చరీ), 2. లలితా బాబర్ (అథ్లెటిక్స్), 3. సౌరవ్ కొఠారీ (బిలియర్డ్స్-స్నూకర్), 4. శివ థాపా (బాక్సింగ్), 5. ఆజింక్య రహానే (క్రికెట్), 6. సుబ్రతా పాల్ (్ఫట్‌బాల్), 7. రాణి (హాకీ), 8. విఆర్ రఘునాథ్ (హాకీ), 9. గుర్‌ప్రీత్ సింగ్ (షూటింగ్), 10. అపూర్వీ చండీలా (షూటింగ్), 11. సౌమ్యజిత్ ఘోష్ (టేబుల్ టెన్నిస్), 12. వినేష్ ఫొగట్ (రెజ్లింగ్), 13. అమిత్ కుమార్ (రెజ్లింగ్), 14. సందీప్ సింగ్ మాన్ (పారా అథ్లెటిక్స్), 15. వీరేందర్ సింగ్ (బధిర రెజ్లర్).
ధ్యాన్ చంద్: సత్తి గీత (అథ్లెటిక్స్), డంగ్ డంగ్ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్ షెల్కే (రోయింగ్).
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన పురస్కారం: నాలుగు విభాగాల కింద ఈ అవార్డును ప్రదానం చేశారు. యువ శక్తిని గుర్తించి, ప్రోత్సహించినందుకుగాను హకీ సిటిజన్ గ్రూప్, దాదప్ పార్సీ జొరాస్ట్రియన్ క్రికెట్ క్లబ్, ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్, స్టెయిర్స్ సంస్థలకు ఈ అవార్డు లభించింది.
కార్పొరేట్ రంగంలో సామాజిక బాధ్యతగా క్రీడాభివృద్ధికి కృషి చేసినందుకు ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేట్ లిమిటెడ్‌కు అవార్డు లభించింది.
క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న సంస్థల కోటాలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు అవార్డు దక్కింది.
క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థల విభాగంలో సుబ్రతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అవార్డును స్వీకరించింది.
వౌలానా అబుల్ కలాం ఆజాద్‌ని ట్రోఫీ పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ స్వీకరించింది.