క్రీడాభూమి

యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ సెరెనా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 31: యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె 29వ ర్యాంకర్ ఎకతరీన మకరోవాను 6-3, 6-3 తేడాతో సునాయాసంగా ఓడించింది. 1999లో మొదటిసారి యుఎస్ ఓపెన్‌లో విజయాన్ని నమోదు చేసిన సెరెనా తన కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసింది. ఇప్పటి వరకూ 22 టైటిళ్లతో స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలో రెండో స్థానాన్ని పంచుకుంటున్న ఆమె 24 టైటిళ్లు గెల్చుకుంటే, నంబర్ వన్ స్థానంలో ఉన్న మార్గరెట్ కోర్ట్‌తో సమవుజ్జీగా నిలుస్తుంది. సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ కూడా తొలి రౌండ్‌ను అధిగమించింది. ఆమె కాతెరినా కొజ్లోవాపై 6-2, 5-7, 6-4 తేడా విజయం సాధించింది. ఐదో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ 6-0, 6-2 ఆధిక్యంతో కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్‌ను చిత్తుచేసింది. 29వ ర్యాంకర్ అనా ఇవానోవిచ్ అనూహ్యంగా మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. డెనిసా అలెర్టోవా 7-6, 6-1 స్కోరుతో ఇవానోవిచ్‌ను ఓడించింది. కాగా, నాలుగో ర్యాంక్ క్రీడాకారిణి అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-1, 6-1 ఆధిక్యంతో క్వాలిఫయర్ జెసికా పెగియాను ఇంటిదారి పట్టించింది. అనస్తాసియా పవ్లిచెన్కోవా, కాతెరినా సినియాకొవా తమతమ ప్రత్యర్థులు లూయిసా చిరికో, యూగెనీ బుచార్డ్‌లను ఓడించి రెండో రౌండ్ చేరారు.
రెండో రౌండ్‌కు ముర్రే
వింబుల్డన్ విజేత, బ్రిటిష్ వీరుడు ఆండీ ముర్రే రెండో రౌండ్ చేరాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న అతను మొదటి రౌండ్‌లో లుకాస్ రోసీని 6-3, 6-2, 6-2 ఆధిక్యంతో ఓడించాడు. జన్కో తిస్పారెవిచ్ చేతిలో 19వ ర్యాంకర్ శామ్ క్వెరీ 6-7, 7-6, 3-6, 3-6 తేడాతో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూశాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన జువాన్ మార్టిన్ డెల్ పొర్టో 6-4, 6-4, 7-6 తేడాతో డియో స్కావర్ట్‌మన్‌పై గెలిచాడు. జపాన్‌కు చెందిన ఆరో సీడ్ కెయ్ నిషికోరి 6-1, 6-1, 3-6, 6-3 తేడాతో బెంజిమిన్ బెకర్‌ను ఓడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో స్టీవ్ జాన్సన్ 4-6, 1-6, 7-6, 6-3, 6-3 తేడాతో యెవ్‌గెనీ డోన్‌స్కోయ్‌పై గెలిచాడు. మొదటి రెండు సెట్లను కోల్పోయిన అతను ఆతర్వాత వరుసగా మూడు సెట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.