క్రీడాభూమి

మ్యాచ్ ఆడకుండానే మూడో రౌండ్‌కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 1: ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఇక్కడ జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ మ్యాచ్ ఆడకుండానే అతను ముందంజ వేశాడు. జొకోవిచ్‌తో తలపడాల్సిన జిరి వెసెలీ గాయం కారణంగా వైదొలిగాడు. ఈఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన మాంటే కార్లో మాస్టర్స్ టోర్నీలో వెసెలీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న జొకోవిచ్ మరోసారి అతనితో తలపడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను కెరీర్‌లో ఇప్పటి వరకూ 12 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. వాటిలో రెండు యుఎస్ ఓపెన్‌లో సాధించినవి ఉన్నాయి. 2011లో మొదటిసారి ఈ టోర్నీలో గెలుపొందిన జొకోవిచ్ నిరుడు మరోసారి విజేతగా నిలిచాడు. టైటిల్‌ను నిలబెట్టుకునే పట్టుదలతో కనిపిస్తున్న అతనికి ఆండీ ముర్రే, రాఫెల్ నాదల్ నుంచి గట్టిపోటీ తప్పదని విశే్లషకుల అభిప్రాయం. నాలుగో సీడ్ నాదల్ 6-0, 7-5, 6-1 తేడాతో ఆండ్రియాస్ సిప్పీని ఓడించి మూడో రౌండ్ చేరాడు. పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ 7-5, 6-4, 6-3 స్కోరుతో క్వాలిఫయర్ జాన్ సట్రాల్‌పై గెలుపొందాడు. జాన్ ఇస్నర్ 6-3, 6-4, 6-7, 6-3 తేడాతో స్టీవ్ డార్సిస్‌పై గెలిచాడు. జాక్ సోక్ 6-1, 6-1, 6-2 స్కోరుతో మిచా జ్వెరెవ్‌ను ఓడించాడు. కెవిన్ ఆండర్సన్ 7-6, 6-4, 6-4 తేడాతో వసెక్ పొస్పిసిల్‌పై విజయం సాధించి మూడో రౌండ్ చేరాడు.

చిత్రం.. మూడో రౌండ్‌కు చేరిన నొవాక్ జొకోవిచ్