క్రీడాభూమి

మెస్సీ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెండోజా (అర్జెంటీనా), సెప్టెంబర్ 2: ప్రపంచ కప్ సాకర్ క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఉరుగ్వేపై తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతను కీలక గోల్ చేయడంతో ఉరుగ్వేను అర్జెంటీనా 1-0 తేడాతో ఓడించింది. అర్జెంటీనా జాతీయ సాకర్ జట్టుకు ఇకపై ప్రాతినిథ్యం వహించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మనసు మార్చుకొని మళ్లీ జట్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2018 వరల్డ్ కప్ కోసం జరుగుతున్న క్వాలిఫయర్స్‌లో భాగంగా ఉరుగ్వేతో మ్యాచ్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో అర్జెంటీనాను మెస్సీ గెలిపించాడు.
అభిమాని హడావుడి
అర్జెంటీనా, ఉరుగ్వే మ్యాచ్ జరుగుతున్నప్పుడు మెస్సీ అభిమాని హడావుడి చేశాడు. మైదానంలోకి దూసుకొచ్చిన అతను మెస్సీ ముందు మోకరిల్లి, అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సంఘటనతో కొన్ని నిమిషాలు ఆటకు అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది ఆ ఆగంతకుడిని బయటకు పంపడంతో ఆట మళ్లీ మొదలైంది.