క్రీడాభూమి

సింధుకు సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 2: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బాడ్మింటన్ స్టార్ పివి సింధును మహారాష్ట్ర బాడ్మింటన్ సంఘం (ఎంబిఎ) శుక్రవారం ఘనంగా సన్మానించింది. సింధును, జాతీయ బాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌ను సత్కరించిన అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేసిన వారిని గౌరవించడం మన ధర్మమని అన్నారు. ఎంబిఎ అధ్యక్షుడు అరుణ్ లఖానీ మాట్లాడుతూ బాడ్మింటన్‌కు దేశంలో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. సింధు ఒలింపిక్ పతకాన్ని సాధించడంతో యువతీయువకులు బాడ్మింటన్‌వైపు ఆకర్షితులు అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మినియేచర్ ర్యాకెట్ బహూకరణ: సింధుకు మినియేచర్ ర్యాకెట్‌ను బహూకరించామని, దానితోపాటు వజ్రాలను కూడా కానుకగా ఇచ్చామని కీఠ్తీలాల్ జ్యుయెలరీ సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
నిశితంగా పరిశీలించిన తర్వాతే..
న్యూయార్క్, సెప్టెంబర్ 2: యుఎస్ ఓపెన్‌లో ఉపయోగించే ప్రతి బంతినీ నిశితంగా పరీక్షిస్తారు. సుమారు 100 అంగుళాల ఎత్తు నుంచి పడేసిన బంతి భూమికి తగిలి 53 నుంచి 58 అంగుళాల ఎత్తుకు ఎగిసినప్పుడే దానిని నాణ్యమైనదిగా గుర్తిస్తారు. అంతేగాక, ఆకారం నుంచి మన్నిక వరకూ అనేకానేక అంశాలను పరిగణలోకి తీసుకొని బంతులను తయారు చేస్తారు. ఆరంభంలో బంతులను చర్మంతో తయారు చేసి లోపలి భాగాన్ని ఊలు లేదా వెంట్రుకలతో నింపేవారు. అప్పట్లో ప్రత్యేకించి ఫలానా రంగులో ఉండాలన్న నిబంధన లేదు. ఇప్పుడు బంతులను లేత ఆకుపచ్చ లేదా గాఢమైన పసుపుపచ్చ రంగులో తయారు చేస్తున్నారు. శర వేగంతో దూసుకొచ్చే బంతులను ఆటగాళ్లు సులభంగా గుర్తించడానికి ఈ రంగును ఎంపిక చేశారు. 1986 సంవత్సరానికి ముందు వింబల్డన్‌లో తెల్ల బంతులను ఉపయోగించేవారు. టీవీలో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు ఆరంభమైన తర్వాత స్పష్టత కోసం పసుపు లేదా లేత ఆకుపచ్చ బంతులను వాడడం అలవాటైంది.
వేగం తక్కువ: యుఎస్ ఓపెన్ మొదలైన తర్వాత సుమారు 100 సంవత్సరాలు గ్రాస్ కోర్టులపైనే మ్యాచ్‌లు జరిగాయి. 1978లో గ్రాస్ కోర్టును తొలగించి ‘డెకో టర్ఫ్’ను ఏర్పాటు చేశారు. మిగతా హార్డ్ కోర్టులతో పోలిస్తే ఈ టర్ఫ్‌పై బంతుల వేగం తగ్గుతుంది. అంతేగాక, బౌన్స్ కూడా తక్కువగా ఉంటుంది. 1970 దశకం మధ్యలో మూడేళ్లపాటు టోర్నీని క్లే కోర్టులపై నిర్వహించారు. ఈ మూడు రకాలైన కోర్టులపై యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఏకైక క్రీడాకారుడు జిమీ కానర్స్.