క్రీడాభూమి

యోగేశ్వర్‌కు స్వర్ణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: లండన్ ఒలింపిక్స్‌లో మరో డోప్‌కేసు బయట పడడంతో, భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌ను అదృష్టం వరించి, స్వర్ణ పతకం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయ. 2012 లండన్ ఒ లింపిక్స్ పురుషుల రెజ్లింగ్ 60 కిలోల విభా గంలో యోగేశ్వర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయతే, ద్వితీయ స్థానంలో ని లిచి, రజత పతకాన్ని స్వీకరించిన రష్యా రెజ్లర్ బెసిక్ ఖుడకోవ్ డోప్ పరీక్షలో దోషిగా తేలడం తో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అత నిని అనర్హుడిగా ప్రకటించింది. తృతీయ స్థానంలో నిలిచిన యోగేశ్వర్‌కు రజత పతకాన్ని ఖాయం చేసింది. కాగా, ఖుడకోవ్ ఒక ప్రమాదంలో మృతి చెందడంతో, తనకు పతకం కంటే మానవత్వం ముఖ్యమని, వీలుంటే రజత పతకాన్ని అతని కుటుంబీకు లకే ఇవ్వాలని ఐఒసి అధికారులకు యోగేశ్వర్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిం దే. ఇలావుంటే, స్వర్ణ పతకం సాధించిన అజర్‌బైజాన్ రెజ్లర్ తొగ్రుల్ అస్గరోవ్ కూడా డోప్ పరీక్షలో విఫలమయ్యాడని సమాచారం. వరుసగా స్వర్ణ, రజత పతక విజేతలు డోప్ పరీక్షలో పట్టుబడడంతో, కాంస్య పతక విజేత యోగేశ్వ ర్‌కు స్వర్ణ పతకం లభిస్తుందని వార్తలు వచ్చాయ. కాగా, ఐఒసి ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

హాక్-ఐ ద్వారా రీప్లే..
యుఎస్ ఓపెన్‌లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు రీప్లేను హాక్-ఐ కంప్యూర్ విధానం తర్వాత తక్షణమే ప్రసారం చేయడానికి వీలుంది. ఈ విధానాన్ని 2006లో మొదటిసారి యుఎస్ ఓపెన్‌లో ప్రవేశపెట్టారు. ఒక సెట్‌లో అత్యధికంగా మూడు పర్యాయాలు రిఫరీ నిర్ణయాన్ని క్రీడాకారులు సవాలు చేయవచ్చు. అప్పీల్ సఫలవుతున్నంత కాలం ఎన్ని అప్పీల్స్‌నైనా చేసే అవకాశం ఉంటుంది. కాగా, టైబ్రేక్ సమయంలో అప్పీల్ చేసుకోవడానికి అదనంగా మరో అవకాశాన్ని కల్పిస్తారు.

యుఎస్ ఓపెన్ 16 మూడో రౌండ్‌కు ముర్రే
న్యూయార్క్, సెప్టెంబర్ 2: ఈసారి యుఎస్ ఓపెన్ టైటిల్ రేసులో గట్టిపోటీదారు, ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్‌లో మూడో రౌండ్ చేరాడు. 2012లో ఇక్కడ విజేతగా నిలిచిన అతను మరోసారి టైటిల్ అందుకునే దిశగా అడుగు ముందుకేశాడు. వర్షం కారణంగా పైకప్పును మూసివేసి, కొనసాగించిన రెండో రౌండ్ మ్యాచ్‌లో అతను స్పెయిన్‌కు చెందిన మార్సెల్ గ్రానొలర్స్‌ను 6-4, 6-1, 6-4 తేడా వరుస సెట్లలో ఓడించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌లకు అంతరాయం జరగకుండా మూసివేయడానికి వీలున్న రూఫ్‌ను యుఎస్ ఓపెన్‌లో ఉపయోగించడం పట్ల అతను ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, జెయింట్ కిల్లర్ జువాన్ మార్టిన్ డెల్ పొట్రో 7-6, 6-3, 6-2 స్కోరుతో స్టీవ్ జాన్సన్‌పై విజయం సాధించాడు. జపాన్‌కు చెందిన ఆరో ర్యాంక్ ఆటగాడు కెయ్ నిషికొరీ కూడా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్‌లో అతను క్వాలిఫయర్ కరెన్ ఖచనోవ్‌పై 6-4, 4-6, 6-4, 6-3 స్కోరుతో విజయం సాధించాడు. మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా 6-1, 7-6, 7-5 తేడాతో మరో క్వాలిఫయర్ అలెస్సాండ్రో గ్లానెసీని ఓడించాడు. ఎనిమిదో సీడ్ డోమినిక్ థియెమ్ 6-4, 6-3, 6-2 స్కోరుతో రిచర్డ్ బెరాన్కిస్‌ను, 14వ సీడ్ నిక్ కిర్గియోస్ 7-5, 6-4, 6-4 ఆధిక్యంతో హోరాసియో జెబలోస్‌ను ఓడించి మూడో రౌండ్‌లో స్థానం సంపాదించారు.