క్రీడాభూమి

రోహిత్, ధావన్ స్థానాలు పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 12: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనే టీమిండియాలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమతమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఫామ్‌ను కోల్పోయి, వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న వీరి ఎంపికపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ ఈ పెద్దకాపులపై నమ్మకం ఉంచింది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ టూర్‌కు ఎంపికైన జట్టును దాదాపుగా అదే విధంగా కొనసాగించాలని నిర్ణయించింది. అయితే, ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌లకు సెలక్టర్లు ఉద్వాసన పలికారు. విండీస్‌కు మొత్తం 17 మందితో కూడిన జట్టు వెళ్లగా, వారి నుంచి బిన్నీ, శార్దూల్‌లను తొలగించిన సెలక్టర్లు 15 మందితో జట్టును ఖరారు చేశారు.
ముగ్గురు ఓపెనర్లు
జట్టులో ముగ్గురు ఓపెనర్లు ఉన్నారు. మురళీ విజయ్, లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్‌లలో ఏ ఇద్దరిని ఓపెనర్లుగా పంపాలన్నది సందర్భాన్ని బట్టి జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుంటుందని సెలక్షన్ కమిటీ వ్యాఖ్యానించింది. గౌతం గంభీర్‌ను జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ, అతని పేరును పరిశీలించలేదు. ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్న ధావన్ లేదా రోహిత్ స్థానంలో గంభీర్‌కు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వారు పట్టించుకోలేదు.
కోహ్లీ మద్దతు!
జట్టులో రోహిత్, ధావన్ స్థానాలు నిలబడడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతే కారణమని సమాచారం. సెలక్షన్ కమిటీ సమావేశంలో కోచ్ అనీల్ కుంబ్లేతోపాటు కోహ్లీ కూడా పాల్గొన్నాడు. రోహిత్, ధావన్‌లపై వేటు పడాలన్న ఆలోచనను అతను తిరస్కరించాడని తెలుస్తోంది. గతంలో కూడా పలు సందర్భాల్లో రోహిత్‌కు తగినన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కోహ్లీ స్పష్టం చేశాడు. సెలక్షన్ కమిటీ సమావేశంలో అతను ఇదే వాదనను వినిపించినట్టు కమిటీ వర్గాలు అంటున్నాయి.
ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్
కోహ్లీసహా జట్టులో ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మురళీ విజయ్, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ, ఆజింక్య రహానే, లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ ఆడతారు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా బ్యాటింగ్‌లో సమర్థుడే. రవీంద్ర జడేజా రూపంలో ఒక్కడే ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నాడు. ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ నడిపించనున్నారు. జట్టులో అశ్విన్, అమిత్ మిశ్రా స్పిన్నర్లు.

జట్టు వివరాలు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), లోకేష్ రాహుల్, చటేశ్వర్ పుజారా, ఆజింక్య రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్.

చిత్రం.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ